AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: షాకింగ్! ఇంటికొచ్చిన అతిథిపై పెంపుడు సింహం దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి

సింహం లాంటి ప్రమాదకరమైన జంతువును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకోవడం కలలో కూడా ఊహించలేము కానీ ఈ వీడియో చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఈ వైరల్ వీడియోలో దంపతులు సింహాన్ని పెంచుకుంటోంది. ఆ సింహం కూడా భారీ సైజులో ఉంది. అది దాడి చేస్తే ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదు. అయితే ఆ మహిళ ఇంటికి ఓ అతిథి రాగా..

Viral Video: షాకింగ్! ఇంటికొచ్చిన అతిథిపై  పెంపుడు సింహం దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి
Lion Attack Viral Video
Janardhan Veluru
|

Updated on: Oct 16, 2023 | 7:39 PM

Share

మనలో చాలా మందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టమే కాదు ప్రాణం కూడా.. చాలా మంది కుక్కలు, పిల్లులు, చిలుకలు వంటి వివిధ జంతువులను పెంచుకుంటారు. ఈ పెంపుడు జంతువులను ఇంట్లో ఓ సభ్యుడిలా చూసుకుంటారు పెట్ ఓనర్స్. ఈ జంతువులు కూడా ఇంటి సభ్యులతో ఎంతో ప్రేమతో మెలుగుతాయి. అయితే ఎవరైనా సింహాన్ని ఇంట్లో పెంచుకోవడం ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో దంపతులు ఓ సింహాన్ని తమ ఇంట్లో పెంచుకున్నట్లు తెలుస్తోంది. కుక్క, పిల్లిని ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకున్నట్లే.. అడవి జంతువు సింహాన్ని వారు ఇంట్లో పెంచుకుంటున్నారు. సింహాన్ని పెంచుకుంటున్నారని చెబితే దాన్ని అందరూ ఈజీగా నమ్మకపోవచ్చు. అయితే ఈ వైరల్ వీడియో చూస్తే మాత్రం సింహాన్ని పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారంటే నమ్మాల్సిందే.

సింహం లాంటి ప్రమాదకరమైన జంతువును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకోవడం కలలో కూడా ఊహించలేము కానీ ఈ వీడియో చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఈ వైరల్ వీడియోలో దంపతులు సింహాన్ని పెంచుకుంటోంది. ఆ సింహం కూడా భారీ సైజులో ఉంది. అది దాడి చేస్తే ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదు. అయితే ఆ మహిళ ఇంటికి ఓ అతిథి రాగా.. ఆ సింహం అతనిపై దాడి చేస్తున్న షాకింగ్ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు అందరికీ వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది. ఆ మహిళ అతి కష్టంమీద సింహాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ, ఆ ఇంటి యజమానులు చివరికి సింహాన్ని వెనక్కి లాగి.. తమ ఇంటికి వచ్చిన అతిథిని అతికష్టం మీద రక్షించారు. సింహం దాడితో ఆ వ్యక్తి కళ్లలో చావు భయం కనిపిస్తోంది. ఇది ఓ రకంగా ఆ వ్యక్తికి పునర్జన్మ అని చెప్పొచ్చు.

ఇంటికొచ్చిన అతిథిపై పెంపుడు సింహం దాడి.. వీడియో

ఈ వీడియోను @TheBrutalNature ఖాతా ద్వారా X లో షేర్ చేశారు. అయితే ఈ వీడియోను ఎక్కడ రికార్డు చేశారన్న వివరాలు మాత్రం అందులో లేదు. ఈ వీడియో చూసిన చాలా మంది ఘాటుగా స్పందించారు. అడవిలో స్వేచ్చగా సంచరించే జంతువులను.. ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకోవడం ఏంటంటూ కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా అతిథి ప్రాణాలు గాల్లో కలిసిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు. వన్యప్రాణులను ఇళ్లలో పెంపుడు జంతువులా పెంచుకోవడం చాలా ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.

Follow Us
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి