AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Workouts: వాటర్ లో వర్క్ అవుట్స్ చేయండి.. సరదాగా బరువు తగ్గండి!

ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఆధారంగా, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మందిని వేధిస్తోన్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఆఫీసుల్లో పని ఒత్తిడి కారణంగా.. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఒక కారణం అయితే.. గంటలు గంటలు తరబడి కూర్చొని పని చేయడం మరో కారణం అవుతుంది. అలాగే సరైన సమయం లేక టైమ్ కి దొరికే ఫుడ్ తినడం వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. ఇక ఆ తర్వాత ఆ బరువును తగ్గించుకోవడానికి..

Water Workouts: వాటర్ లో వర్క్ అవుట్స్ చేయండి.. సరదాగా బరువు తగ్గండి!
Water Workouts
Chinni Enni
|

Updated on: Oct 17, 2023 | 5:54 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఆధారంగా, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మందిని వేధిస్తోన్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఆఫీసుల్లో పని ఒత్తిడి కారణంగా.. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఒక కారణం అయితే.. గంటలు గంటలు తరబడి కూర్చొని పని చేయడం మరో కారణం అవుతుంది. అలాగే సరైన సమయం లేక టైమ్ కి దొరికే ఫుడ్ తినడం వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. ఇక ఆ తర్వాత ఆ బరువును తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. వాకింగ్ లు, జాకింగ్ లు, వర్కౌట్స్, డైట్ ఫుడ్ ఇలా ఎన్నో చేయాల్సి వస్తుంది. అలాగే ప్రస్తుతం ఇప్పుడు వాటిల్లో వాటర్ వర్కౌట్స్ కూడా బాగా పాపులర్ అవుతుంది. ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. లాభాలు మాత్రం చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాటర్ వర్కౌట్స్ చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే ఫిట్ గా మారతారు. మరి ఈ వాటర్ వర్కౌట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

కండరాలు స్ట్రాంగ్ అవుతాయి:

వాటర్ వర్క్ అవుట్స్ చేయడం వల్ల కాళ్లు, చేతుల్లోని కండరాలు బలంగా మారతాయి. అలాగే కీళ్ల నొప్పులు వంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఇతర కీళ్ల సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. అంతే కాకుండా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు ఈ వర్కౌట్స్ చేయడం వల్ల ఉపశమనం పొంద వచ్చు.

ఇవి కూడా చదవండి

వెయిల్ లాస్ అవుతారు:

వాటర్ వర్కౌట్స్ చేయడం వల్ల శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరుగుతుంది. వాటర్ వర్క్ అవుట్స్ ఎక్కువగా కేలరీలు బర్న్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈజీగా, సరదాగా బరువు తగ్గినట్టు ఉంటుంది. మీకు ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి.. ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ అని చెప్పవచ్చు.

ఒత్తిడి తగ్గుతుంది:

నీటిలో ఆడాలని చిన్న పిల్లలు, పెద్దవారికి సైతం అనిపిస్తుంది. ఇలా వాటర్ లో వర్కౌట్స్ చేయడం వల్ల సరదాగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మంచి రిలీఫ్ గా ఫీల్ అవుతారు.

జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది:

మీరు వాటర్ లో సరదాగా వర్కౌట్స్ చేయడం వల్ల.. ఎక్కువ సేపు సమయం కేటాయిస్తారు. దీంతో కేలరీలు త్వరగా బర్న్ అవుతుంది. దీంతో జీర్ణ క్రియ కూడ వేగవంతం అవుతుంది. కాబట్టి ఇతర సమస్యలు కూడా ఉండవు.

మీరు వాటర్ వర్కౌట్స్ చేయాలనుకుంటే.. దగ్గర్లోని నిపుణులను కలవడం మంచిది. వారి పర్యవేక్షణలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో.. వాటికి తగ్గట్టుగా వాటర్ వర్కౌట్స్ చేయడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే