AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ragi Malt: మండే ఎండల్లో రాగి అంబలి చేసే అద్భుతం.. అమ్మమ్మల కాలంనాటి టేస్టీ రెసిపీ

రాగి అంబలి ఒక ఆరోగ్యకరమైన వంటకం. ఇది రాగుల నుండి తయారవుతుంది. మీరు ఆరోగ్య ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదయం అల్పాహారంగా దీన్ని తీసుకోవచ్చు. ఇది మీ రోజుని ఆరోగ్యంగా ప్రారంభించడానికి సహాయం చేస్తుంది. రాగుల్లో ఫైబర్, ప్రొటీన్లు, కాల్షియం, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాగులు అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

Ragi Malt: మండే ఎండల్లో రాగి అంబలి చేసే అద్భుతం.. అమ్మమ్మల కాలంనాటి టేస్టీ రెసిపీ
Ragi Ambali In Summer To Beat The Heat
Bhavani
|

Updated on: Mar 30, 2025 | 11:27 AM

Share

రాగి అంబలి తీసుకుంటే.. ఎండలతో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్, ఖనిజాలు, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. రాగి అంబలితో శరీరానికి చాలా బలం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. ఉదయం పూట రాగి అంబలి ఒక్క గ్లాస్ తాగినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రాగి అంబలిని ఈరోజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందురోజు రాత్రే రాగిపిండిని ముద్దలుగా చేసుకొని నానబెట్టుకోవాలి. రాగిపిండి చక్కగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మన అమ్మమ్మలు ఏం చేసేవారంటే, తడి చేతితో చిన్న రాగిముద్దను చేతిలోకి తీసుకునేవారు. అప్పుడు రాగిపిండి చేతికి అంటనట్లయితే అది పర్ఫెక్ట్​గా ఉడికిందని తెలుసుకునేవారు. రాగిపిండిని మట్టిపాత్రల్లో రాత్రంతా ఊరనివ్వడం ద్వారా అంబలి చల్లగా, రుచికరంగా ఉండి వేసవిలో తాగేకొద్దీ తాగాలనిపిస్తుంది. అదే, రాగి ముద్దలను స్టీలు గిన్నెల్లో నానబెడితే పిండి కాస్త పులుపెక్కే ఛాన్స్ ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు :

రాగి పిండి – ఒక కప్పు పెరుగు – ఒక కప్పు ఉప్పు – రుచికి సరిపడా సన్నని కొత్తిమీర తరుగు – 2 టేబుల్​స్పూన్లు సన్నని కరివేపాకు తరుగు – కొద్దిగా ఉల్లిపాయ తరుగు – పిడికెడు అల్లం తరుగు – కొద్దిగా పచ్చిమిర్చి సన్నని తరుగు – 1 టేబుల్​స్పూన్

సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా :

ముందుగా ఒక బౌల్​లో రాగి పిండిని తీసుకొని నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టౌ మీద ఆ బౌల్​ని ఉంచి పాత్రను రాగి పిండి వదిలేసే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. రాగి పిండి చిక్కగా మారగానే ఉడికినట్టు కాదు. ఇలా తాగడం వల్లనే కడుపులో మంట, పుల్లటి తేన్పులు రావడం, అరగనట్టు అనిపించడం జరుగుతుందట. కాబట్టి, నిదానంగా మధ్యమధ్యలో కలుపుతూ రాగి పిండి 15 నుంచి 18 నిమిషాలు ఉడికించుకోవాలి. రాగిపిండి చక్కగా ఉడికి, కలిపితే గరిటెకు అంటుకోకుండా జారిపోతుందో అప్పుడు గిన్నెను దింపి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మట్టిపాత్రలో ముప్పావు భాగం వరకు(ఒకటిం పావు లీటర్) వాటర్​ తీసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన రాగి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, మట్టిపాత్రలో తీసుకున్న వాటర్​లో వేసుకోవాలి. ఆపై మూతపెట్టి రాత్రంతా ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం ద్వారా శరీరానికి, పొట్టకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. నెక్ట్స్ డే నానబెట్టుకున్న ఆ ముద్దలను చేతితో ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని తరకలు లేకుండా విస్కర్ సహాయంతో బాగా చిలుక్కోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావలో వేసుకొని కలుపుకోవాలి. ఆపై ఉప్పు వేసుకొని రెండు మూడుసార్లు బాగా చిలుక్కోవాలి. ఇక చివర్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకోవాలి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే