Health Tips: స్ట్రాబెర్రీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?
ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చాలా మంది పెరిగిపోతున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో యూత్ వయస్యసు ఉన్న వారి నుంచి వృద్ధుల వరకు గుండెపోటు సమస్యలు అధికంగా అవుతున్నాయి. అయితే చిన్న వయస్సులోనే గుండెకు సంబంధిత వ్యాధులు తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది. అయితే స్ట్రాబెర్రీతో ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఈ రుచికరమైన పండు తినడం వల్ల ఎలాంటి ..
స్ట్రాబెర్రీ .. దీనిని అందరు అమితంగా ఇష్టపడుతుంటారు. దీనిని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంది. చూడగానే తినాలనిపించేలా ఉంటుంది. మనలో చాలా మంది దాని తీపి, పుల్లని రుచికి ఆకర్షితులవుతారు. ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో ఈ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చాలా మంది పెరిగిపోతున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో యూత్ వయస్యసు ఉన్న వారి నుంచి వృద్ధుల వరకు గుండెపోటు సమస్యలు అధికంగా అవుతున్నాయి. అయితే చిన్న వయస్సులోనే గుండెకు సంబంధిత వ్యాధులు తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది. అయితే స్ట్రాబెర్రీతో ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఈ రుచికరమైన పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
ఈ పండులో ఉండే పోషకాలు ఏవంటే..
ఇందులో విటమిన్-C ఎక్కువగానే ఉంటుంది. తేకాకుండా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది.
స్ట్రాబెర్రీతో అద్భుతమైన ప్రయోజనాలు ఏవంటే..
1. క్యాన్సర్ చికిత్స, క్యాన్సర్ నివారణ లక్షణాలు స్ట్రాబెర్రీలలో ఉన్నాయి. ఇది క్యాన్సర్‌ను నిరోధించడంలో మీకు సహాయపడుతుంది.
2. దంతాలపై ఉండే పసుపు పొరను తొలగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిలో ఎంజైములు ఏర్పడకుండా చేస్తుంది.
3. ఇందులో పొటాషియం అనేది అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
4. స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పాలీఫెనాల్స్ సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
5. స్ట్రాబెర్రీలో ఫైబర్‌తో పాటు అనేక విధాలుగా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో నీరు కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలను ఎలా తినాలి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్ట్రాబెర్రీలను సలాడ్ లేదా పెరుగుతో కలిపి తినవచ్చు. ఇది కాకుండా వాటిని అల్పాహారం సమయంలో కార్న్‌ఫ్లేక్స్ లేదా ఓట్స్‌లో కూడా చేర్చవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఈ పండును నేరుగా తినవచ్చు. కొంతమంది షేక్స్ లేదా స్మూతీస్ తయారు చేసి తింటారు. అయితే దీనిని తయారు చేయడంలో చక్కెర కలిపితే, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి