AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drumstick Benefits: ఆరోగ్యానికి దివ్యౌషధం మునగ ఆకు.. దాని ప్రయోజనాలు తెలుస్తే అస్సలు వదలరంతే..

Drumstick Benefits: మునగ ప్రయోజనాల గురించి చాలా వినే ఉంటారు. మునగను అన్ని వంటకాల్లో వినియోగిస్తుంటారు. మునగ ఆకులు, కాడ, కాయల్లో, పువుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Drumstick Benefits: ఆరోగ్యానికి దివ్యౌషధం మునగ ఆకు.. దాని ప్రయోజనాలు తెలుస్తే అస్సలు వదలరంతే..
Shiva Prajapati
|

Updated on: Feb 13, 2022 | 9:41 AM

Share

Drumstick Benefits: మునగ ప్రయోజనాల గురించి చాలా వినే ఉంటారు. మునగను అన్ని వంటకాల్లో వినియోగిస్తుంటారు. మునగ ఆకులు, కాడ, కాయల్లో, పువుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్ వంటి మూలకాలతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకులలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకులను కూరగా వండుకుని తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా ఆకులను ఎండబెట్టి పొడి చేసి తినవచ్చు. ఆయుర్వేదంలో , ఈ ఆకులను అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. దాని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మునగ ఆకుల ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తిని బలోపేతం.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో పోషకాలు చాలా ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని  పెంచడంలో సహాయపడుతంది.  మీ శరీరం అన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా నుండి రక్షించబడుతుంది.

కిడ్నీ స్టోన్‌ సమస్య నుంచి ఉపశమనం.. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు నిపుణులు. కిడ్నీలోని రాళ్లను కరిగించి మూత్ర ద్వారా బయటకు వెళ్లేందుకు సహకరిస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..

మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. మునగ ఆకు కూర తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ  కూడా నియంత్రణలోకి వస్తుంది.

డయాబెటిక్ రోగులకు.. డయాబెటీస్ సమస్యలు ఉన్నవారికి కూడా మునగ ఆకులు చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. దీని ఆకులు యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో ఎంతో ప్రభావం చూపుతాయి.

ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం.. అనేక  రకాల వ్యాధులకు మూలం జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. మనుగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also read:

Knowledge Video: దేశంలో ఎన్ని కోట్ల మొబైళ్లు తయారయ్యాయో తెలుసా..? షాకింగ్ విషయాలు వెల్లడి..

Amit Shah in Punjab: పంజాబ్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కట్టుదిట్టమైన పోలీసుల భద్రతా ఏర్పాట్లు

Dog Viral Video: ఈ కుక్క వేసే యోగాసనాలు చూస్తే షాకవ్వాల్సిందే..! వైరల్‌ అవుతున్న సూపర్ వీడియో..