Foods: విరేచనాలు అయినప్పుడు పొరపాటున కూడా ఇవి తినొద్దు.. లేదంటే పెను ప్రమాదం తప్పదు..

Foods: వర్షాకాలంలో చాలా మందికి అతిసారంతో బాధపడుతుంటారు. అతిసారం కారణంగా మనుషులు తీవ్రంగా నీరసించిపోతారు.

Foods: విరేచనాలు అయినప్పుడు పొరపాటున కూడా ఇవి తినొద్దు.. లేదంటే పెను ప్రమాదం తప్పదు..
Health
Shiva Prajapati

|

Jul 07, 2022 | 6:15 AM

Foods: వర్షాకాలంలో చాలా మందికి అతిసారంతో బాధపడుతుంటారు. అతిసారం కారణంగా మనుషులు తీవ్రంగా నీరసించిపోతారు. తరచుగా మలవిసర్జన చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. చాలా సందర్భాలలో అతిసారానికి కారణం తెలియదు. ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు, డ్రగ్స్ తీసుకోవడం మొదలైన అనేక కారణాల వల్ల డయేరియా రావచ్చు. అతిసారం లక్షణాలు లేనప్పటికీ, అలసట, వాంతులు, కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటివి ఉండవచ్చు. అతిసారం చాలా తక్కువ సమయం వరకు ఉంటుంది. కొన్ని రోజుల్లో దానంతటదే నయం అవుతుంది. కానీ విరేచనాలు చాలా వారాల పాటు కొనసాగితే.. అది ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అలాంటి సమయాల్లో మీ డైట్‌లో ఏయే ఆహారపదార్థాలు చేర్చుకోవాలి, ఏ ఆహారాలు అస్సలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

అతిసారం లక్షణాలు: తరచుగా విరేచనాలు అవడం, కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట, వాంతులు, జ్వరం, మలంలో రక్తం వంటి సమస్యలు ఉండవచ్చు.

విరేచనాలు అయినప్పుడు వీటిని తీసుకోండి.. అరటిపండ్లు, అన్నం, యాపిల్స్, బ్రెడ్ తినండి అతిసారం త్వరగా పోతుంది. ఈ పదార్థాలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నీరు పుష్కలంగా త్రాగాలి.. అతిసారంతో బాధపడేవారు ఎక్కువగా నీటిని తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే తక్కువ మోతాదులో బ్లాక్ టీ, కొబ్బరి నీరు కూడా తీసుకోవచ్చు. కొంచెం బెటర్ అనుకుంటే.. గుడ్లు, ఉడికించిన కూరగాయలను తినవచ్చు.

అతిసారం ఉంటే వీటిని అస్సలు తీసుకోవద్దు.. అతిసారం ఉన్నప్పుడు తినకూడని అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. కొన్ని ఆహారాలు సమస్యను తగ్గించే బదులు మరింత తీవ్రతరం చేస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కొవ్వు, మృదువైన ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మాంసం, పచ్చి కూరగాయలు, ఉల్లిపాయలు, మొక్కజొన్న, సిట్రస్ పండ్లు, ఆల్కహాల్, కాఫీ, సోడా, కృత్రిమ స్వీటెనర్లను తీసుకోకూడదు.

చికిత్స, ఇంటి నివారణలు.. అతిసారంలో అనేక కేసులు స్వల్పకాలికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం, డ్రింక్స్ మందులు వంటి ఇంటి నివారణలతో నయం చేయవచ్చు. కొన్నిసార్లు విరేచనాలు వార్మ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సందర్భంలో, యాంటీబయాటిక్స్ సహాయంతో నయమవుతుంది. కానీ, విపరీతమైన విరేచనాలు ఉంటే.. ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి.. విరేచనాలు సాధారణంగా విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం, మందుల సహాయంతో నయమవుతాయి. కానీ 2 రోజుల కంటే ఎక్కువ కాలం ఈ సమస్య ఉండి, చాలా బలహీనంగా ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డీహైడ్రేషన్‌తో పాటు, ఏవైనా ఇతర లక్షణాలు ఉంటే వైద్యుడిని చూపించుకోవాలి. మలంలో రక్తం రావడం, తీవ్రమైన కడుపు నొప్పి, అధిక జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu