Health Tips: మధుమేహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వ్యాధిని నియంత్రించే దివ్యౌషధం ఇదిగో..
Health Tips: కోవిడ్ మహమ్మారి చాలా మంది ప్రజల జీవన విధానంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఇది మానవత్వ శక్తిని దెబ్బతీయడమే కాకుండా..
Health Tips: కోవిడ్ మహమ్మారి చాలా మంది ప్రజల జీవన విధానంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఇది మానవత్వ శక్తిని దెబ్బతీయడమే కాకుండా, ఇంటి నుండి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి తీసుకువచ్చింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. చాలా మంది ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి జీవనశైలి, ఆహారపుటలవాట్లు మధుమేహానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మధుమేహం ఒకటి. మన దేశంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వంటింట్లో మసాలా దినుసులు..
కిచెన్‌లో దొరికే మసాలా దినుసులు మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ముఖ్యంగా మనం నిత్యం వంటకాల్లో వినియోగించే లవంగాలు మధుమేహానికి దివ్యౌషధంగా పని చేస్తుంది.
లవంగం ఎలా ప్రభావం చూపుతుంది?
లవంగాలలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. లవంగాలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా, లవంగాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. కానీ డయాబెటిక్ పేషెంట్లు లవంగాలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోరు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను ఎలా తినాలి?
ఒక గ్లాసు నీటిలో 8 లేదా 10 లవంగాలను ఉడకబెట్టాలి. ఈ నీటిని వడకట్టి వేడిగా తాగాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కనీసం మూడు నెలల పాటు దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..