Diabetic Diet: ఈ 5 ఆయుర్వేద మూలికలు రక్తంలో షుగర్ లెవల్స్‌ని సహజంగా తగ్గిస్తాయి..

Diabetic Diet: టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు మూలికలు అత్యంత సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా పేర్కొంటారు ఆయుర్వేద నిపుణులు.

Diabetic Diet: ఈ 5 ఆయుర్వేద మూలికలు రక్తంలో షుగర్ లెవల్స్‌ని సహజంగా తగ్గిస్తాయి..
Diabetic
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 16, 2022 | 7:16 AM

Diabetic Diet: టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు మూలికలు అత్యంత సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా పేర్కొంటారు ఆయుర్వేద నిపుణులు. డయాబెటిస్‌ను అనేక మందుల ద్వారా నియంత్రించవచ్చు. సరైన ఆహారం, సరైన నిద్ర, శారీరక శ్రమ వంటి కొన్ని జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం. వీటితో పాటు.. డయాబెటిస్‌ను నియంత్రించడంలో ఆయుర్వేదం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మన వంటగదిలో లభించే అనేక మూలికలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. అయితే, ఇక్కడ చేయాల్సిందల్లా ఒక్కటే.. వాటిని సరైన సమయంలో, సరైన మార్గంలో తీసుకోవడం. కొన్ని ఆయుర్వేద మూలికలు టైప్ 2, టైప్ 1 డయాబెటిస్‌ రెండింటినీ నియంత్రించడంలో సహాయపడుతాయి.

మధుమేహాన్ని నియంత్రించే 5 ఆయుర్వేద మూలికలు ఇవే..

మెంతులు : ఇది రుచికి చేదుగా ఉంటుంది. కానీ, ఊబకాయం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, LDL, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క : మీరు డయాబెటిక్ అయితే? దాల్చిన చెక్క అద్భుతాలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది అదనపు కొవ్వును కరిగించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను సైతం కంట్రోల్‌లో ఉంచడానికి ఉపయోగపడుతుంది.

అల్లం : అల్లంలో యాంటీ డయాబెటిక్, హైపోలిపిడెమిక్, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. HbA1Cతో పాటు షుగర్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. డాక్టర్ సలహా మేరకు అల్లం ను మితంగా తీసుకోవాలి.

బ్లాక్ పెప్పర్ : ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మీ శరీరక శక్తిని మెరుగుపరుస్తుంది. నల్ల మిరియాలు పైపెరిన్‌తో నిండి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో నిర్వహించడంలో సహాయపడుతుంది.

జిన్సెంగ్ : ఇది ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు ఒకరి శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తుంది. అందువలన, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి