AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మధుమేహం బాధితులు గుడ్లు తినొచ్చా? సురక్షితమేనా? తప్పక తెలుసుకోండి..

‘ఆదివారం అయినా, సోమవారం అయినా ప్రతిరోజూ గుడ్లు తినండి’. చిన్నప్పటి నుంచి ఈ డైలాగ్ వింటూనే ఉన్నాం. గుడ్డు నిజంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్లలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే డయాబెటిక్ పేషెంట్ల మదిలో గుడ్లు తినవచ్చా లేదా అనే ప్రశ్న తరచుగా వస్తుంది. కారణం.. సమస్య మరింత తీవ్రం అవుతుందేమోనని భయం.

Health Tips: మధుమేహం బాధితులు గుడ్లు తినొచ్చా? సురక్షితమేనా? తప్పక తెలుసుకోండి..
Eggs Benefits
Shiva Prajapati
|

Updated on: Sep 09, 2023 | 11:40 AM

Share

‘ఆదివారం అయినా, సోమవారం అయినా ప్రతిరోజూ గుడ్లు తినండి’. చిన్నప్పటి నుంచి ఈ డైలాగ్ వింటూనే ఉన్నాం. గుడ్డు నిజంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్లలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే డయాబెటిక్ పేషెంట్ల మదిలో గుడ్లు తినవచ్చా లేదా అనే ప్రశ్న తరచుగా వస్తుంది. కారణం.. సమస్య మరింత తీవ్రం అవుతుందేమోనని భయం.

గుడ్లలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మధుమేహాన్ని పెంచుతాయని, దాని వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందని కొందరు నమ్ముతారు. మరోవైపు, గుడ్లు తినడం వల్ల శరీరం పూర్తి పోషణకు మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. అయితే వీటన్నింటిలో ప్రశ్న ఏమిటంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినవచ్చా లేదా? అనేదే ఇప్పుడు టాస్క్.

గుడ్లపై పరిశోధన..

మధుమేహం విషయంలో ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో స్వల్ప నిర్లక్ష్యం రక్తంలో చక్కెర స్థాయిలను పాడు చేస్తుంది. ఫిన్లాండ్ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, డయాబెటిక్ పేషెంట్లు కోడిగుడ్లను పరిమితంగా తినవచ్చు. ఇది శరీరానికి పోషకాహారాన్ని అందించడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుడ్డు కూడా సంపూర్ణ ఆహారం

పాలలాగే గుడ్లు కూడా సంపూర్ణ ఆహారంగా పరిగణించబడతాయి. రోజూ గుడ్లు తినేవారి రక్తంలో కొంత మొత్తంలో లిపిడ్ ప్రొఫైల్ ఏర్పడుతుందని, దీనివల్ల ప్రజలు అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతారని ఈ పరిశోధనలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినవచ్చని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కూడా తెలిపింది.

ఒక గుడ్డులో 0.5 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అదనంగా, గుడ్లు తినడం వల్ల బయోటిన్ పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి మంచిది. విశేషమేమిటంటే గుడ్లలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

గుడ్లు ఎలా తినాలి..

డయాబెటిక్ పేషెంట్లు వారానికి మూడు గుడ్లు తింటే.. దీని వల్ల వారికి ఎలాంటి హాని ఉండదు. ఆహారంలో గుడ్లు తీసుకుంటే, నూనె, వెన్న తీసుకోవడం తగ్గించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..