AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Fever: డెంగ్యూ ఫీవర్ నియంత్రణ కోసం 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్.. పూర్తి వివరాలివే..

Dengue Fever: డెంగ్యూ దోమ కాటు ద్వారా వస్తుంది. ప్రతీ ఏటా చాలా మంది డెంగ్యూ భారిన పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ కేసులు..

Dengue Fever: డెంగ్యూ ఫీవర్ నియంత్రణ కోసం 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్.. పూర్తి వివరాలివే..
Dengue
Shiva Prajapati
|

Updated on: Jul 29, 2022 | 2:21 PM

Share

Dengue Fever: డెంగ్యూ దోమ కాటు ద్వారా వస్తుంది. ప్రతీ ఏటా చాలా మంది డెంగ్యూ భారిన పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వర్షాకాలంలో నీరు అధికంగా నిలువ ఉంటుంది. దీని వలన దోమలు పెరిగి.. జనాలపై విజృంభిస్తాయి. డెంగ్యూ వలన.. అధిక జ్వరం, తలనొప్పి, కళ్లు లాగడం, అలసట, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, వికారం, వాంతులు వంటి ఏర్పడుతాయి. డెంగ్యూ జ్వరానికి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే, ఆయుర్వేదం ప్రకారం.. డెంగ్యూ లక్షణాలను నియంత్రించడంలో సహాయపడే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ నివారణలు అధిక జ్వరాన్ని తగ్గించి.. ఇతర లక్షణాల నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయి. మరి ఆ హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. తిప్పతీగ జ్యూస్.. డెంగ్యూ జ్వరం నివారణిగా తిప్పతీగ రసం (గిలోయ్ జ్యూస్’ ప్రసిద్ధి. గిలోయ్ రసం జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలమైన రోగనిరోధక శక్తి డెంగ్యూ జ్వరాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. రోగికి ఉపశమనం ఇస్తుంది. తిప్పతీగకు సంబంధించిన రెండు చిన్న కాడలను ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టవచ్చు. ఈ నీటిని కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఒక కప్పు మరిగించిన నీటిలో కొన్ని చుక్కల తిప్పతీగ రసాన్ని కలిపి రోజుకు రెండుసార్లు త్రాగవచ్చు. అయితే, ఈ తిప్పతీగ రసాన్ని అధికంగా తీసుకుంటే.. ఇతర సమస్యలు తలెత్తుతాయి.

2. బొప్పాయి ఆకు రసం.. డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో బొప్పాయి ఆకు రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది. బొప్పాయి ఆకు రసం కూడా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది డెంగ్యూ చికిత్సలో సహాయపడుతంది. డెంగ్యూ వ్యాధి నుంచి బయటపడాలంటే.. బొప్పాయి ఆకుల రసాన్ని రెండుకు రెండుసార్లు కొద్ది మోతాదులో తీసుకోవాలి.

3. తాజా జామ పండ్ల రసం.. జామ పండ్ల రసం బహుళ పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరానికి చికిత్సలో తాజా జామ రసం అద్భుతంగా పని చేస్తుంది. జామ రసం వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయి. ఒక కప్పు జామ రసాన్ని రోజుకు రెండుసార్లు త్రాగాలి. జ్యూస్‌కు బదులుగా తాజా జామపండ్లను కూడా తినవచ్చు.

4. మెంతి గింజలు.. మెంతులు కూడా డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో బహుళ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని మెంతులను ఒక కప్పు వేడి నీటిలో నానబెట్టి.. నీటిని చల్లారే వరకు ఉంచాలి. ఆ నీటిని రోజుకు రెండుసార్లు తాగాలి. విటమిన్ సి, కె, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మెంతి నీరు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మెంతి నీరు జ్వరాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు.. బలమైన రోగనిరోధక వ్యవస్థ డెంగ్యూను నిరోధించడంలో సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరం నుండి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తి డెంగ్యూను ప్రారంభంలో అడ్డుకుని, నియంత్రిస్తుంది. తినే ఆహారంలో సిట్రస్ ఆహారాలు, వెల్లుల్లి, బాదం, పసుపు, మరెన్నో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

గమనిక: డెంగ్యూ లక్షణాలు గమనించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. పైన తెలిపిన చిట్కాలను వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..