AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాయామం చేయడానికి బద్దకిస్తున్న భారతీయులు.. ప్రమాదంలో ఆరోగ్యం.. ఈ 3 వస్తువులను తినడం లేదు..

లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కి సంబంధించిన తాజా నివేదిక ప్రకారం.. భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళల్లో అయోడిన్ లోపం ఎక్కువగాఉంది. మహిళలు తక్కువ అయోడిన్ తీసుకుంటారు. అదే సమయంలో పురుషులు మహిళల కంటే తక్కువ జింక్ తీసుకుంటారని తెలుస్తోంది. నివేదిక ప్రకారం భారతదేశంలోని పురుషులు , స్త్రీలలో ఐరెన్, కాల్షియం, ఫోలేట్ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అధ్యయనం కేవలం భారత దేశంలో మాత్రమే కాదు 185 దేశాల్లోనూ అధ్యయనం చేసింది. ఆయా దేశాల్లోని ప్రజలకు 15 అవసరమైన సూక్ష్మపోషకాల లోపం ఉన్నట్లు తేలింది.

వ్యాయామం చేయడానికి బద్దకిస్తున్న భారతీయులు.. ప్రమాదంలో ఆరోగ్యం.. ఈ 3 వస్తువులను తినడం లేదు..
Health Deficiency In India
Surya Kala
|

Updated on: Aug 31, 2024 | 8:25 PM

Share

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యమే అతి పెద్ద లైఫ్‌సేవర్ అని అంటారు.. అయితే ఇటీవల భారతీయుల ఆరోగ్యానికి సంబంధించిన ఒక సంచలన నివేదిక వెలువడింది. ఈ నివేదికలో భారతదేశంలోని స్త్రీలు మాత్రమే కాదు పురుషులకు కూడా 3 ముఖ్యమైన పోషకాల కొరత ఉందని చూపిస్తుంది. భారతదేశంలో స్త్రీలలో హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లు తరచుగా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా పురుషులకు కూడా కొన్ని ముఖ్యమైన విటమిన్లలో లోపంతో ఇబ్బంది పడుతున్నారని నివేదికలో వెల్లడైంది.

లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కి సంబంధించిన తాజా నివేదిక ప్రకారం.. భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళల్లో అయోడిన్ లోపం ఎక్కువగాఉంది. మహిళలు తక్కువ అయోడిన్ తీసుకుంటారు. అదే సమయంలో పురుషులు మహిళల కంటే తక్కువ జింక్ తీసుకుంటారని తెలుస్తోంది.

పురుషులు, స్త్రీలలో ఈ లోపాలు

నివేదిక ప్రకారం భారతదేశంలోని పురుషులు , స్త్రీలలో ఐరెన్, కాల్షియం, ఫోలేట్ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అధ్యయనం కేవలం భారత దేశంలో మాత్రమే కాదు 185 దేశాల్లోనూ అధ్యయనం చేసింది. ఆయా దేశాల్లోని ప్రజలకు 15 అవసరమైన సూక్ష్మపోషకాల లోపం ఉన్నట్లు తేలింది.

ఇవి కూడా చదవండి

70 శాతం ప్రజల్లో వివిధ లోపాలు

పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది ప్రజలు అయోడిన్, విటమిన్ ఇ , కాల్షియం తగిన మొత్తంలో తీసుకోవడం లేదు. మహిళల్లో అయోడిన్, విటమిన్ బి12 , ఐరన్ లోపం ఉందని పరిశోధనలో వెల్లడైంది. అయితే మహిళలతో పోలిస్తే పురుషులలో మెగ్నీషియం, విటమిన్ బి6, జింక్, విటమిన్ సి లోపం ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. నివేదిక ప్రకారం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో 10 నుండి 30 సంవత్సరాల వయస్సు గల స్త్రీ, పురుషులు చాలా తక్కువ కాల్షియం తీసుకుంటున్నారని వెల్లడించింది.

వ్యాయామంలో చేయడానికి బద్దకించే భారతీయులు

జూన్‌లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కి సంబంధించిన మరొక నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో సగం మందిపై పైగా వ్యాయామం చేయడానికి బద్దకిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వీరి జీవితం లేదు. దేశంలో , వ్యాయామం, శారీరక శ్రమ, కసరత్తు తగ్గుముఖం పట్టిందని నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరంలో 22 శాతం ఉంటే 2022 నాటికి 49.4 శాతానికి చేరుకుంది. దీని ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది వ్యాయామం చేయడం లేదు. మహిళలు (57%) , పురుషులు (42%) వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..