Beauty Tips: చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..

కొంతమందికి చిన్నతనంలోనే ముఖంపై ముడతలు, గీతలు వస్తుంటాయి. దీంతో చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. మరి ఈ సమస్యను నివారించుకోడానికి ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు. అది కూడా సహజసిద్ధంగా.. అందుకు ఏంచేయాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు.? వృద్ధాప్య ఛాయలు మీ దరికి చేరకూడదంటే.. పౌష్టికాహారం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు.

Beauty Tips: చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..

|

Updated on: Aug 31, 2024 | 5:59 PM

కొంతమందికి చిన్నతనంలోనే ముఖంపై ముడతలు, గీతలు వస్తుంటాయి. దీంతో చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. మరి ఈ సమస్యను నివారించుకోడానికి ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు. అది కూడా సహజసిద్ధంగా.. అందుకు ఏంచేయాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు? వృద్ధాప్య ఛాయలు మీ దరికి చేరకూడదంటే.. పౌష్టికాహారం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు. ఇందులో బ్లూబెర్రీస్‌ చర్మసౌందర్యానికి చక్కగా పనిచేస్తాయంటున్నారు. ఇందులో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే పాలీఫినోల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు అధికంగా లభిస్తాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేయడంలోనూ ఇవి సహాయపడతాయి. కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల నవయవ్వనంతో మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు.

అలాగే టొమాటోలో ఉండే లైకోపీన్ సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మానికి మెరుపు వస్తుంది. తేనెలో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే తేనెను ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు, పలు ఫేస్‌ ప్యాక్స్‌లోనూ వాడచ్చు. చర్మానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. దీనివల్ల చర్మం లోలోపలి నుంచి మెరుపు సంతరించుకుంటుంది. చర్మంపై వచ్చే అలర్జీ, దద్దుర్లను తగ్గించడంలోనూ పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్‌ తోడ్పడతాయి.

ఓట్స్‌, గోధుమ, బార్లీ.. వంటి వాటినీ మనం రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. మన శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయితే చర్మం తాజాగా, యవ్వనంగా కనిపిస్తుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే గ్రీన్‌ టీని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా సరిపడినంత నీరు త్రాగాలి. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించాలంటే మన శరీరంలో నీటిశాతం తగినంత ఉండాలి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువ మొత్తంలో తినడం అలవాటు చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారించుకోవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us