TV9 Ismart News: హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకం టూరుకొచ్చిన యముడు, దెయ్యం
అవ్వుల్లా.. ఎవలి నాల్కె మీదన్న మచ్చలుంటె.. వాళ్లు చెప్పిన మాటలు ముమ్మాటికి నిజమైతయటగదా? అంతేగదా.. అయితె ఆ లెక్కెంబడి తెలంగాణ రాష్టానికి కావొయ్యే సీయం గ్యారంటీగ ఉత్తమ్ కుమార్రెడ్డి సారే అన్నట్టు.. అగొ ఎవలి నాల్కె మీద మచ్చలున్నయ్.. ఎవల్ చెప్పిర్రా మాట అంటరా? ఇగ సూడరాదుర్రి.. వామ్మో.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సారు ముక్కుసూటి మన్షేనుల్ల.. సారు ముంగట ఎవలన్న తప్పుడు లెక్కలు చెప్తె ఎంటనే కడిగి పారేస్తుండు.
ఉత్తమ్ కుమారే కాబొయ్యే సీయం మచ్చల నాల్కెతోటి చెప్పిండు జాతకం 6 నెలల్ల నాటిర్రట 60 లక్షల మొక్కలు స్పీకర్ సారు సూపెట్టమన్నడు లెక్కలు జోరుగ నడ్శినయ్ వరలక్ష్మి వ్రతాలు శెత్తిర్లు, టోపీలు వెట్కోని చేశిర్రు ఆడోల్లు హైడ్రా భయానికి ఇరుగుడు మందు అందరు చేపిచ్కోవాల్నట ఇసంటి కంటేనర్ ఇండ్లు అవ్వుల్లా.. ఎవలి నాల్కె మీదన్న మచ్చలుంటె.. వాళ్లు చెప్పిన మాటలు ముమ్మాటికి నిజమైతయటగదా? అంతేగదా.. అయితె ఆ లెక్కెంబడి తెలంగాణ రాష్టానికి కావొయ్యే సీయం గ్యారంటీగ ఉత్తమ్ కుమార్రెడ్డి సారే అన్నట్టు.. అగొ ఎవలి నాల్కె మీద మచ్చలున్నయ్.. ఎవల్ చెప్పిర్రా మాట అంటరా? ఇగ సూడరాదుర్రి.. వామ్మో.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సారు ముక్కుసూటి మన్షేనుల్ల.. సారు ముంగట ఎవలన్న తప్పుడు లెక్కలు చెప్తె ఎంటనే కడిగి పారేస్తుండు.. అగొ.. 6 నెల్లల్ల 60 లక్షల మొక్కలు నాటిర్రు ఫారెస్టోల్లు అని కలెక్టర్ మేడం చెప్పంగనె… ఏడ వెట్టిర్రో సూపెడ్తవా? అని మొకం మీదనే అడిగిండు గిట్ల.. అబబబ.. నిన్నంత మన రొండు తెలుగు రాష్టాలల్ల వరలక్ష్మి పూజల సందడే నడ్శిందిగదా? శిన్నశిన్న గుల్ల కాడికేలి పెద్దపెద్ద పుణ్యక్షేత్రాల దం.. మొత్తం వరలక్ష్మి వ్రతాలే నడ్శినయ్.. సెలెబ్రిటీలు, సామాన్యులన్న తేడాలేకుంట.. శానమంది పూజల్ల పాల్వంచుకున్నరు..పార్రి ఓ మల్క అట్లట్ల సూశినట్టు చేద్దం ఎట్ల నడ్శినయో పూజలు.. ఈనడ్మ కావల్శినోల్లు అనుకోకుంట కాలంజేస్తె.. వాళ్లను మర్శిపోలేక వాళ్ల మైనం బొమ్మలు, విగ్రహాలు చేపిచ్చి వెట్కుంటున్నరుగద శానమంది? ఆ బొమ్మలను సూస్కుంట, వాళ్లు మనతోనే ఉన్నరని ఫీలైతుంటరు.....
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

