kedarnath helicopter accident goes viral: ఇటీవల విమానాలు, హెలికాప్టర్ లు తరుచుగా ప్రమాదాలకు గురౌతున్నాయి. ఏవేవో సాంకేతిక సమస్యలు తలెత్తి విమానాలు గాల్లోనే బ్లాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని సార్లు సిగ్నలింగ్ సమస్యల వల్ల ఒక చోట లాండ్ అవ్వాల్సిన హెలికాప్టర్ లు మరోక చోట లాండ్ అవుతున్నాయి. హెలికాప్టర్ లలో టెక్నికల్ సమస్యల వల్ల.. దేశాధినేతలు, ఆర్మీ ముఖ్య అధికారులు, వీఐపీలు, సినిమా స్టార్ లు, రాజకీయ నాయకులు కూడా చనిపోయిన ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో హెలికాప్టర్ లు తరచుగా అనేక రకాల సాంకేతిక సమస్యలతో వార్తలలో ఉంటున్నాయి.