Health Care Tips: రాత్రుల్లో కాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం

Subhash Goud

Subhash Goud |

Updated on: Aug 07, 2022 | 6:30 AM

Leg Pain Home Remedies Tips: రాత్రి పడుకునే ముందు చాలా సార్లు మీరు కాళ్లలో తీవ్రమైన నొప్పిని అనుభవించి ఉంటారు. కాలి నొప్పి అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది..

Health Care Tips: రాత్రుల్లో కాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం
Leg Pain

Leg Pain Home Remedies Tips: రాత్రి పడుకునే ముందు చాలా సార్లు మీరు కాళ్లలో తీవ్రమైన నొప్పిని అనుభవించి ఉంటారు. కాలి నొప్పి అనేది ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. ఈ నొప్పి కారణంగా, రోజంతా చాలా సార్లు అలసట ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే నొప్పి ఎక్కువగా మారే ప్రమాదం ఉంది. పాదాల నొప్పి నుండి విముక్తి పొందడానికి మీరు ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

మస్టర్డ్ ఆయిల్ తో మసాజ్: మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పి తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రాత్రిపూట ఆవాల నూనెను వేడి చేసి పాదాలను బాగా మసాజ్ చేయండి. ఇది మీకు నొప్పి నుండి చాలా ఉపశమనం ఇస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె: ఆపిల్ సైడర్ వెనిగర్ కాళ్లల్లో నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనాల్జేసిక్ గుణాలు ఉన్నాయి. ఇది పాదాలలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఒక కప్పులో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, అర టీస్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మెంతులు: మెంతులు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లిమెటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కారణంగా ఇది మంచి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా మెంతులను నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. మీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక చెంచా మెంతి గింజలను కూడా నమలవచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల నొప్పులను కూడా దూరం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ యోగా చేయండి: రోజూ యోగా చేయడం ద్వారా మీరు కాలి నొప్పి నుండి చాలా ఉపశమనం పొందుతారు. యోగా చేయడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి శరీరం యాక్టివ్‌గా మారుతుంది. మీ పాదాలలో లేదా మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. మీరు కాలు తిమ్మిరిని తగ్గించడానికి బౌండ్ యాంగిల్, డాల్ఫిన్, ఈగిల్ లేదా ఎక్స్‌టెండెడ్ సైడ్ యాంగిల్ అన్ని చేయవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయుర్వేద నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu