High Cholesterol: ఈ సమస్య జుట్టులో కనిపించినట్లయితే మీరు అధిక కొలెస్ట్రాల్ బారిన పడినట్లే.. జాగ్రత్త..!

High Cholesterol: మన జీవనశైలి, తినే ఆహారం కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చి చేరుతున్నాయి. ప్రతి ఒక్కరు జీవన శైలిలో మార్పులు చేసుకోకపోతే ఇబ్బందులు..

High Cholesterol: ఈ సమస్య జుట్టులో కనిపించినట్లయితే మీరు అధిక కొలెస్ట్రాల్ బారిన పడినట్లే.. జాగ్రత్త..!
High Cholesterol
Follow us
Subhash Goud

|

Updated on: Aug 06, 2022 | 6:30 AM

High Cholesterol: మన జీవనశైలి, తినే ఆహారం కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చి చేరుతున్నాయి. ప్రతి ఒక్కరు జీవన శైలిలో మార్పులు చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. కొలెస్ట్రాల్ మన శరీరంలో కొవ్వు స్థాయి పెరిగితే, అది మన కణాలలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాల నిర్మాణంలో కొలెస్ట్రాల్ ముఖ్యపాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ధమనులలో పేరుకుపోయిన ఈ కొవ్వు అంటే కొలెస్ట్రాల్ రక్త ప్రసరణపై చెడు ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. ఈ సందర్భంలో, గుండెపోటు సమస్య పెరుగుతుంది. దీంతో సైలెంట్‌ కిల్లర్‌గా వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. గుండెతో పాటు, అధిక కొలెస్ట్రాల్ అనేక ఇతర మార్గాల్లో కూడా మనపై ప్రభావం చూపుతుందంటున్నారు వైద్యులు. నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల జుట్టు ఆరోగ్యంలో సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ జుట్టు సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందని గమనించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు జుట్టులో కనిపిస్తాయి..

మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే, మీ జుట్టు ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుందని నిపుణులు అంటున్నారు. జుట్టు వేగంగా రాలడం లేదా సమయం కంటే ముందే జుట్టు తెల్లగా మారే వ్యక్తుల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటుందని భావించవచ్చంటున్నారు. ఒక పరిశోధన ప్రకారం.. జంతువులను అధ్యయనం చేస్తున్నప్పుడు, వాటికి అధిక కొలెస్ట్రాల్ ఆహారాన్ని ఇచ్చారు. కొంత సమయం తర్వాత వాటి జుట్టు రాలడం ప్రారంభమైంది. మీరు కూడా అలాంటి డైట్ రొటీన్ పాటిస్తే, మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటి నివారణలు చిట్కాలు..

ఆహారం ద్వారా: అధిక కొలెస్ట్రాల్‌ను వదిలించుకోవడానికి మీరు కొత్తిమీర గింజలను తీసుకోవచ్చు. దీని కోసం, కొత్తిమీర విత్తనాలను ఒక రాత్రి ముందు నానబెట్టి, ఉదయం ఈ నీటిని కొద్దిగా వేడి చేయండి. ఇప్పుడు అది గోరువెచ్చగా ఉన్నప్పుడు, సిప్ ద్వారా తాగాలి. ఈ హోం రెమెడీ కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేయడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది.

జుట్టుకు రెమెడీ: మీరు జుట్టు రాలడం లేదా తెల్లటి జుట్టు నుంచి రక్షించుకోవాలంటే.. జుట్టు సంరక్షణ కోసం చిట్కాలను అనుసరించాలి. ఇందులో వెంట్రుకలకు నూనె రాసుకోవడం దగ్గర నుంచి కడగడం వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది కాకుండా వారానికి ఒకసారి అవకాడో హెయిర్ మాస్క్‌ను అప్లై చేయండి. దీంతో జుట్టు రాలడం ఆగడమే కాకుండా వాటి ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి)