Monkeypox: మంకీపాక్స్‌తో భయం వద్దు.. ఈ ఆయుర్వేద నివారణలతో మిమ్మల్ని మీరు నయం చేసుకోండి
Monkeypox: ఒక వైపు కరోనా మహమ్మారి జనాలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంటే.. మరో కొత్త వైరల్ ఆందోళనకు గురి చేస్తోంది. అదే మంకీపాక్స్..
Monkeypox: ఒక వైపు కరోనా మహమ్మారి జనాలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంటే.. మరో కొత్త వైరల్ ఆందోళనకు గురి చేస్తోంది. అదే మంకీపాక్స్. ఈ కేసులు భారత్‌లో వేగంగా పెరుగుతున్నాయి. ఈ మంకీపాక్స్ కారణంగా ఒకరు మరణించారు కూడా. ఆసియాలో కూడా దీని కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇంతలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతదేశంలో దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వైరస్ లక్షణాలు 6 నుండి 12 రోజులలో కనిపిస్తాయి. ఈ లక్షణాలలో మైకము, అధిక జ్వరం , దద్దుర్లు, వాపు ఉంటాయి. మంకీపాక్స్ చికిత్స కోసం టీకాలు, మందులు పని చేస్తున్నాయి. అయితే మీరు కొన్ని ఆయుర్వేద నివారణలను అనుసరించడం ద్వారా చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.
మూలికల ఉపయోగం:
ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకుంటే, మీరు మంకీపాక్స్ వంటి తీవ్రమైన వ్యాధికి వ్యతిరేకంగా కూడా పోరాడవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, మీరు త్రిఫల, అర్గవధ, త్రివత్ వంటి మూలికలను తీసుకోవాలి. ఈ ఆయుర్వేద మూలికల ద్వారా వైరస్ నుంచి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది.
మీ చర్మంపై దద్దుర్లు ఉంటే చర్మాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. మీరు అలోవెరా జెల్‌ను ఉపయోగిస్తే శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా వేప నీళ్లతో తలస్నానం చేస్తే శరీరంపై ఉండే దద్దుర్లు కూడా తగ్గుతాయి. మీరు వేప పత్ర క్వాత్, త్రిఫల క్వాత్ తో చర్మాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చు.
వీటిని తినండి:
మీరు మంకీపాక్స్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే, మీరు సాధారణ ఆహార పద్ధతిని అనుసరించాలి. మూంగ్ దాల్‌ను తినడం ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మీరు ఉదయం అల్పాహారంగా ఓట్స్ లేదా గంజిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఆహారంలో ద్రవపదార్థాలను చేర్చుకోండి .పండ్లలో దానిమ్మ వంటి పండ్లను ఖచ్చితంగా తీసుకోవాలి.
యోగా చేయండి:
ఆయుర్వేదంలో యోగాకు ప్రత్యేక స్థానముంది. తడసానా, బాలాసన్ వంటి యోగాసనాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇది కాకుండా, ఈ యోగాసనాలతో చురుకుగా ఉండగలుగుతారు.
(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి