AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Craving: ఎల్లప్పుడూ తీపి తినాలనిపిస్తుందా..? అయితే ప్రమాదమే.. ఏం చేయాలో తెలుసుకోండి

Health Care Tips: కొత్త సంవత్సరం నాడు చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని తీర్మానం చేసుకోని ఉంటారు. అయితే.. స్వీట్లను ఇష్టపడే వారు చాలా మంది

Sugar Craving: ఎల్లప్పుడూ తీపి తినాలనిపిస్తుందా..? అయితే ప్రమాదమే.. ఏం చేయాలో తెలుసుకోండి
Sweets
Shaik Madar Saheb
|

Updated on: Jan 08, 2022 | 7:50 AM

Share

Health Care Tips: కొత్త సంవత్సరం నాడు చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని తీర్మానం చేసుకోని ఉంటారు. అయితే.. స్వీట్లను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. దీని కారణంగా వారు బరువు తగ్గడంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. తీపి పదార్థాలు బరువును పెంచుతాయి. కావున ఉత్తమమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని.. వేయించినవి.. నూనె, తీపిని పదార్థాలను దూరం పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఎక్కువగా తీపి పదార్థాలు తినడాన్ని షుగర్ క్రవింగ్ అంటారు. అంటే.. ప్రజలు వాటిని చూస్తే తమపై నియంత్రణ కోల్పోయి.. స్వీట్లను తినడం ప్రారంభిస్తారు. దీంతో సాయంత్రం సమయంలో మన శరీరంలో చక్కెర కోరిక గణనీయంగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

అధిక కేలరీల ఆహారాలు సాయంత్రం తీసుకుంటే.. అది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారికి.. మేము మీకు కొన్ని సులభమైన చిట్కాలను అందించబోతున్నాము. వీటిని అనుసరించడం ద్వారా మీరు చక్కెర కోరికలను చాలా వరకు నియంత్రించడంతోపాటు బరువు తగ్గవచ్చంటున్నారు.

పండ్లపై ఆధారపడవద్దు చాలా మంది డైటింగ్ సమయంలో పండ్లు మాత్రమే తినడానికి ఇష్టపడతారు. కానీ అలా చేయడం వల్ల వారు ఆకలితో ఉంటారు. చాలాసార్లు ఆకలి నియంత్రణ ఉండకపోవడం వల్ల స్వీట్లు తీసుకుంటారు. కావున తృణధాన్యాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల కడుపు నిండుగా ఉండి తీపీ కోరికలు ఉండదని పేర్కొంటున్నారు.

తగినంత నీరు తాగాలి మీకు స్వీట్లు తినాలని అనిపించినప్పుడల్లా.. నీరు తాగటం మంచిది. దీని వల్ల ఆ సమయంలో కడుపు నిండుతుంది. దీంతో తీపి పదార్థాలపై మోజు ఉండదు. నీరు తాగినప్పుడు మీ పొట్ట నిండుగా ఉంటుంది.. ఈ స్థితిలో స్వీట్లు తిన్నా ఎక్కువవుతున్నట్టు అనిపిస్తుంది. దీంతో క్రమంగా మనసు షుగర్ కి దూరమవడం మొదలవుతుందంటున్నారు.

ఒత్తిడి  చాలా సార్లు.. చక్కెర తినాలన్న కోరిక తీర్చుకోకపోతే.. రక్తంలో చక్కెర స్థాయి క్షీణించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఇది ఒత్తిడికి కారణం అవుతుంది. అటువంటి పరిస్థితిలో కడుపు నిండుగా ఉంచండి. తద్వారా మీకు చక్కెర కోరికలు ఉండవు. మిఠాయిలు తినాలని అనిపించదు. మీ కడుపు నిండుగా ఉంచడం కూడా ఒకరకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో బరువు తగ్గొచ్చు.

నిద్ర.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్ర సరిగ్గా పోకపోయినా.. శరీరం తీపిని కోరుకోవడం ప్రారంభిస్తుంది. మెలుకువతో ఉండటం వల్ల స్వీటు పదార్థాలు తినాలనిపిస్తుంది. అందుకే రోజంతా 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర పొందడం వల్ల శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మానికి కూడా ఉత్తమమైనదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Omicron Test Kit: తక్కువ ధరతో ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. మార్కెట్‌లోకి ఎప్పుడు రానుందంటే

Ram Gopal Varma : వర్మకు అపాయింట్ మెంట్ దొరికిందోచ్.. మంత్రి నానిని ఎప్పుడు కలవనున్నదంటే..