చలికాలంలో మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా?
చలికాలంలో కొబ్బరి నీరును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చర్మం పొడిబారటం, వృద్ధాప్య సంకేతాలను అరికట్టడంలో కొబ్బరి నీరు చాలా ఉపకరిస్తుంది. మోకాళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో టాక్సిన్లను తొలగించడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. కాబట్టి ఉదయాన్నే ఒక గ్లాసు కొబ్బరి నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచింది.
మనలో చాలా మంది కొబ్బరి నీరును వేసవిలో ఎక్కువ మంది తాగుతుంటారు. కానీ చలీకాలంలో మాత్రం చాలా తక్కువగా తీసుకుంటారు. కొంత మంది అయితే మొత్తానికి కొబ్బరి నీరుని తాగడమే మానేస్తారు. కానీ ఈ కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు నియంత్రణ, చర్మ సంరక్షణ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
రోగనిరోధక శక్తి పెంపు
చలికాలంలో చాలా మంది వ్యాధుల నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కొబ్బరి నీరు దీనిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ నీటిలోని రిబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, పిరిడాక్సిన్ వంటి పదార్థాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచేందుకు ఎంతో ఉపకరిస్తాయి, అందువల్ల చలికాలంలో కొబ్బరి నీరు తాగడం ద్వారా మీరు అనేక రోగాల బారిన పడకుండా ఉంటారు.
బరువు తగ్గడం
చలికాలంలో శరీర వ్యాయామం తగ్గడం, అధిక ఆహారం తీసుకోవడం, ఇవన్నీ బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే, కొబ్బరి నీరు ఈ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నీటిలోని ఎంజైమ్ ల జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరంలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తాయి. దీంతో బరువు పెరుగుదల ఆగిపోతుంది. అంతేకాకుండా, కొబ్బరి నీరు జీర్ణక్రియను వేగవంతం చేయడం ద్వారా ఆహారాన్ని సులభంగా పంచగలదు. ఈ ప్రభావం వల్ల, శరీరంలో విసర్జించబడని ఆహారం కొవ్వులుగా మారదు, కాబట్టి బరువు తగ్గడంలో ఇది ఒక సహజ సహాయంగా మారుతుంది.
చర్మ సంరక్షణ
చలికాలంలో చర్మం పొడిబారటం, పొడిబారిన దురద వంటి సమస్యలు చాలా మందిని బాధిస్తాయి. కొబ్బరి నీరు అయితే ఈ సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో ఉన్న సైటోకినేస్ అనే పదార్థం చర్మానికి తేమను, తాజాదనాన్ని ఇస్తుంది. సైటోకినేస్ ఒక యాంటీ ఏజింగ్ పదార్థం, ఇది వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిగా అరికట్టడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, దీని వల్ల చర్మం మరింత మృదువుగా మారుతుంది. చలికాలంలో ఆలోచన లేకుండా చర్మం తేమను కోల్పోతుంది. కాబట్టి కొబ్బరి నీరును చర్మ సంరక్షణ కోసం తీసుకోవడం అత్యంత సహాయపడుతుంది.
మోకాళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు
చలికాలంలో మోకాళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు చాలామందికి ఉంటాయి. అయితే కొబ్బరి నీరు ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం. ఇందులోని కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నీటిలో మెగ్నీషియం కూడా ఉంటుంది, ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, చలికాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతారు. దాంతో టాక్సిన్‌లు శరీరంలో నిల్వ అవుతాయి. కానీ కొబ్బరి నీరు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఉదయం నిద్రలేచినప్పుడు ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగడం శరీరాన్ని శుభ్రపరచడంలో, అలాగే వ్యాధుల్ని నివారించడంలో మేలు చేస్తుంది.
ఈ విధంగా కొబ్బరి నీటిని చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించవచ్చు. అయితే కొబ్బరి నీటిని లిమిటెడ్ గా తీసుకోవడం మంచిది.