Health Benefits of Cloves: లవంగాలు తింటే.. ఈ అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమే.. అవేంటంటే..?
Health Benefits of Cloves: ప్రతి ఇంట్లోనూ ఉండే మసాలా దినుసులల్లో లవంగాలు కూడా ఉంటాయి. పలు వంటకాల్లో, కూరల్లో లవంగాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి లవంగాల వల్ల ఆహార పదార్థాలకు మంచి టేస్ట్
Cloves Health Benefits: ప్రతి ఇంట్లోనూ ఉండే మసాలా దినుసులల్లో లవంగాలు కూడా ఉంటాయి. పలు వంటకాల్లో, కూరల్లో లవంగాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి లవంగాల వల్ల ఆహార పదార్థాలకు మంచి టేస్ట్ రావడంతోపాటు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమంటున్నారు వైద్య నిపుణులు. లవంగాలు తినడం లల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఈ లవంగాలను కాస్మాటిక్స్, ఫార్మాసూటికల్స్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. దంతాలకు ఆరోగ్యాన్ని అందించే టూత్ పేస్ట్‌లల్లో కూడా లవంగాలను ఉపయోగిస్తారు. ఈ లవంగాల నుంచి విటమిన్ ఏ, విటమిస్ సి సైతం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ లవంగాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..
దుర్వాసనకు..
నోటి నుంచి బాగా దుర్వాసన వస్తుంటే రెండు, మూడు లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే వెంటనే తగ్గిపోతుంది. నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి. చిగుళ్లు కూడా ఆరోగ్య వంతంగా ఉంటాయి. దంతక్షయం బారిన పడరు.
ఉదరం సమస్యలు…
కడుపులో బాగా వికారంగా అనిపించినా, ఆహారం జీర్ణం కాకపోయినా.. గ్యాస్ సమస్యలున్నా.. లవంగాలను నోట్లో వేసుకొని రసాన్ని మింగితే ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉన్నా వెంటనే తగ్గిపోతాయి.
డయాబెటిస్..
డయాబెటిస్ ఉన్న వారు నిత్యం మూడు పూటలా ఒక లవంగాన్ని తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని.. రక్త ప్రసరణ మెరుగుపడుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
తలనొప్పి
లవంగాలలో ఉండే మాంగనీసు, ఐరన్ ఎముకలను దృఢంగా మారుస్తాయి. తలనొప్పి అధికంగా ఉండేవాళ్లు ప్రతిరోజూ రెండు లవంగాలు తింటే ఆరోగ్యానికి మంచిది.
ఫ్యాట్ బర్నర్..
దీంతోపాటు కొవ్వును తగ్గించడంలో లవంగాలు సహకరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజూ లవంగాలను తినడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది
Also Read: