Whatsapp: వాట్సాప్ యూజర్లకు షాక్.. మరో కొత్త లోపాన్ని గుర్తించిన భద్రతా నిపుణులు!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వాట్సాప్ యాప్ పై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉంటున్నాయి. ఈ యాప్ భద్రతపై చాలాసార్లు సందేహాలు వచ్చాయి.
Whatsapp:ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వాట్సాప్ యాప్ పై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉంటున్నాయి. ఈ యాప్ భద్రతపై చాలాసార్లు సందేహాలు వచ్చాయి. మళ్ళీ సర్దుమణిగిపోయాయి. అయితే, ఇప్పుడు మళ్ళీ అటువంటి సందేహమే తలెత్తుతోంది. వాట్సాప్ యూజర్ల ఖాతాలను ఫోన్ నెంబర్ సహాయంతో రిమోట్ గా హ్యాకర్లు సస్పెండ్ చేసే అవకాశం ఉందని భద్రతా పరిశోధకులు చెబుతున్నారు. దీంతో మళ్ళీ వాట్సాప్ తో భద్రత ఎంత అనే ఆందోళన మొదలైంది. రిమోట్ ఎటాకర్ మీ ఫోనులో వాట్సాప్ ను పనిచేయకుండా చేసి.. కొద్దీ గంటలపాటు అలానే యాక్టివేట్ కాకుండా ఉంచగలడు. ఇదే గనుక నిజం అయితే, వేలాది మంది వాట్సాప్ యూజర్లు ప్రమాదంలో పడినట్టే. ఒక వేళా మీరు వాట్సాప్ భద్రత కోసం టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసుకున్నప్పటికీ ప్రమాదంలో ఉన్నట్టే అని భద్రతా పరిశోధకులు అంటున్నారు. వాట్సాప్ ఖాతాను రిమోట్‌గా బ్లాక్ చేసే లోపాన్ని భద్రతా పరిశోధకులు లూయిస్ మార్క్వెజ్ కార్పింటెరో, ఎర్నెస్టో కెనాల్స్ పెరెనా మొదటిసారిగా కనుగొన్నారు.
వీరు చెప్పిన వివరాల ప్రకారం.. ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయబడిన వాట్సాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేయడానికి అనుమతిస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్‌లో లభించే ఆరు అంకెల రిజిస్ట్రేషన్ కోడ్‌ను పొందకపోతే వారు మీ ఖాతాలో లాగిన్ కావడానికి అవకాశం ఉండదు. కానీ, వారికి కూడా కావాల్సింది కూడా అదే. మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నించి తర్వాత వారి ఫోన్‌లో 12 గంటలు పాటు వాట్సాప్‌లోని కోడ్ ఎంట్రీలను కూడా బ్లాక్ చేస్తుంది. దీంతో వెంటనే మీరు మీ ఫోన్ నంబర్ను యాప్ నుంచి బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంతే హ్యాకర్ కి ఇక పండగే.
ఎందుకంటే మీరు ఎప్పుడైతే వాట్సాప్ నుంచి మీ ఫోన్ నంబర్ బ్లాక్ చేయడానికి సహాయం కోరుతారో అప్పుడు వారికి కొత్త ఈ మెయిల్ చిరునామా, ఫోన్ పోయిందని మీరిచ్చిన ఈమెయిల్ కావాలి అంతే. ఆ ఈ మెయిల్కు ప్రతిస్పందనగా, దాడి చేసేవారు వారి వైపు నుంచి త్వరగా అందిస్తారని ధృవీకరించడానికి వాట్స్ఆప్ అడుగుతుంది. ఇలా మీ వాట్సాప్ ఖాతా బ్లాక్ అవుతుంది. దీంతో మీరు మీ ఫోన్ నుంచి వాట్సాప్ యాక్సిస్ చేయలేరు. హ్యాకర్ పంపిన ఈ మెయిల్ ద్వారా మీ ఖాతా బ్లాక్ చేసి ఉంటుంది. మామూలుగా అయితే, మీరు మీ ఫోన్ నెంబరును ధ్రువీకరించడం ద్వారా మీ వాట్సాప్ ఖాతాను అన్ లాక్ చేయవసీక్యూ.
కానీ, మీరు మీ వాట్సాప్ ఖాతాకు ఎన్నో ప్రయత్నాలు చేయడం.. పన్నెండు గంటలు పాటు హ్యాకర్ మీ ఖాతా లాక్ చేసి ఉంటె ఇది సాధ్యం కాదు. అంటే మీరు పన్నెండు గంటల పాటు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్ పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల హ్యాకర్ల ఏమిటీ లాభం అనుకుంటున్నారా? మళ్ళీ 12 గంటల తరువాత హ్యాకర్లు ఇలా చేయకుండా ఉండటం కోసం మీ నుంచి డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది.
అయితే, టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసే సమయంలో ఇచ్చిన మెయిల్ ద్వారా తిరిగి మీ ఖాతాను పొందే అవకాశం ఉంటుంది. కానీ, అది ఈ లోపాన్ని సరిచేయగలదా? లేదా అనేది వాట్సాప్ స్పష్టం చేయలేదు. వాట్సాప్ ఈ లోపం పై స్పందించే వరకూ వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే.
Also Read: Thunderstorms Effect: పిడుగుపాటును తప్పించుకోవచ్చా…? ఆసక్తికరమైన విషయాలు చదివితే షాకే !
Partnered: మార్కెట్లోకి సామ్‌సంగ్ F12 వచ్చేసింది.. ధర తక్కువ.. ఫీచర్లు మాత్రం అనేకం..