Elaichi For Good Health: ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నారా ? మీ ఇంట్లో ఉండే యాలకులు ఎంతో బెస్ట్..
ఇటీవల కాలంలో చాలా మంది ఆరోగ్యం పై శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనా వైరస్ పుణ్యమా అని ఎక్కువ వరకు ఇంట్లో చేసిన వంటకాలను తినడానికే ఇష్టపడుతున్నారు.
ఇటీవల కాలంలో చాలా మంది ఆరోగ్యం పై శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనా వైరస్ పుణ్యమా అని ఎక్కువ వరకు ఇంట్లో చేసిన వంటకాలను తినడానికే ఇష్టపడుతున్నారు. దీంతో మనం నిత్యం ఇంట్లో వాడే మసాలాలు శరీరానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను తినడానికి శ్రద్ద చూపిస్తున్నారు. ఇక మన వంటింట్లో మసాలాల్లో ముఖ్యమైనది యాలకులు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇండియాలో విరివిగా లభిస్తాయి. అయితే వీటిని జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచి లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా గ్రీన్, బ్లాక్ అనే రెండు రకాలుంటాయి. ఇందులో ఎక్కువగా గ్రీన్ యాలకులను వాడుతుంటారు.
యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా వ్యాధుల్ని కూడా దరిచేరనియ్యవు. అంతేకాకుండా ఒత్తిడిని ఎదుర్కునేందుకు మనం తీసుకునే టీ లేదా పాలల్లో కలుపుకొని తాగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇక వీటిలో ఉండే మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలున్నాయి. జీర్ణక్రియ వ్యవస్థ సరిగా పనిచేయడానికి తోడ్పడతాయి. కడుపులో మంట, నొప్పి వంటి వాటిని రాకుండా చేస్తాయి. ఉద్యోగస్తులు, మరియు ఎక్కువగా ఒత్తిడిని పొందేవాళ్ళు దానిని తగ్గించుకునేందుకు యాలకులు టీలో కలుపుకొని తాగితే ఫలితం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆస్తమాకు కూడా చెక్ పెట్టెయ్యోచ్చు. కఫం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు యాలకులను రెగ్యులర్‌గా తీసుకుంటు ఉండాలి. ఇవే కాకుండా రక్త ప్రసరణను తేలిక చేసి, ఉపిరితిత్తులకు మేలు చేస్తాయి. యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉండటం వలన డయాబెటీస్ నుంచి కాపాడుతుంది. ఇవి బీపీని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండెకు మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు.. కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండెకు రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి.
Also Read:
Health News: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆహార పద్ధతులు పాటిస్తే ఫలితం పక్కా..