Hair Protect Tips in home: మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? మీ ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఇలా ట్రై చేయండి..
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఎన్నో రకాల షాంపులు మార్చిన ఫలితం కనపించడం లేదని బాధపడుతుంటారు. అయితే జుట్టు

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఎన్నో రకాల షాంపులు మార్చిన ఫలితం కనపించడం లేదని బాధపడుతుంటారు. అయితే జుట్టు సమస్యలకు ఉల్లిపాయ రసం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు రాలడాన్ని నివారించడంతోపాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఉల్లిపాయ రసం జుట్టు రాలకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అలాగే ఈ రసాన్ని తలకు మర్ధన చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు మర్ధన చేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయ రసానికి ఆయిల్ కలిపి తలకు పట్టించిన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులోని ఆమ్లాలో ఉండే విటమిన్ సీ జుట్టు రంగు మారకుండా చేస్తుంది. అంతేకాకుండా రెండు చెంచాల ఉసిరి రసం, లేదా ఉసిరి పొడిని నిమ్మరసంతో కలిపి తలకు పట్టించి ఇరువై నిమిషాల తర్వాత గోరువెచ్చిని నీటితో తలస్నానం చేస్తే జుట్టు రంగు మారకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయ ముక్కలను పేస్ట్ చేసి నేరుగా తలకు పట్టించి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచి తర్వాత చల్లిని నీటితో లేదా గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం ద్వారా క్రమంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. బాలీవుడ్ నటి బిపాస పాసు కూడా తన జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది.
Best Health News: చలికాలంలో ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటా.. అవి ఎంటంటే ?