చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా ?.. అయితే మీ వంటింట్లో ఉండే పదార్థాలతో సులభంగా తగ్గించుకోండిలా..

దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. దీనికి తోడు చలికాలంలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత చాలా పెరగడంతో పలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా ?.. అయితే మీ వంటింట్లో ఉండే పదార్థాలతో సులభంగా తగ్గించుకోండిలా..
Follow us

|

Updated on: Dec 26, 2020 | 5:57 PM

దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. దీనికి తోడు చలికాలంలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత చాలా పెరగడంతో పలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటివి అందిరిలోనూ వచ్చే సమస్యలు. వీటి నుంచి మన వంటింట్లో ఉండే పదార్థాలతో సులభంగా బయటపడవచ్చు. అదేలా అంటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

సాధరణంగా మన వంటగదిలో ఉండే పదార్థం వెల్లుల్లి. దీనిలో ఉండే ఆంటి వైరల్, ఆంటి బాక్టీరియల్, ఆంటీ ఫంగల్ కారకాలు జలుబుని తగ్గించడమే కాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలో ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకొని తాగితే జలుబు తొందరగా తగ్గుతుంది. దీంతోపాటు అల్లం కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తోంది. దీనిలో క్యాన్సర్ నిరోధక పదార్థాలు ఉన్నాయి. రోజులో ఒక్కసారైన అల్లం టీ తాగితే జర్వం వాంతులు తగ్గడంతోపాటు, అలసట తగ్గుతుంది. తేనేలో ఉండే పదార్థాల వలన యాంటీ బాక్టీరియల్‏గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. అంతేకాకుండా చలికాలంలో గొంతునొప్పితో బాధపడేవారు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిది. వీటితోపాటు అరటి పండు కూడా మంచిదే. జలుబు చేసినప్పుడు అరటి పండు తింటే మరింత ఎక్కువ అవుతుందంటారు. కానీ అరటి పండులో ఉండే పోషక పదార్థాలు జలుబును తగ్గించడంలో సహయపడతాయి.