Trisha Krishnan Birthday: దశాబ్దాల కెరీర్‏లో ఎన్నో వివాదాలు.. ఇప్పటివరకు త్రిష సంపాదించిన ఆస్తులు ఎంతంటే..

అలాగే త్రిష రేర్ ఫోటోస్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. 1983 మే 4న చెన్నైలోని మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు జన్మించింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తి కలగడంతో మోడలింగ్ రంగంవైపు అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే మిస్ చెన్నై టైటిల్ గెలుచుకుంది. 1999లో లేసా లేసా సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. 16 ఏళ్ల వయసు నుంచే త్రిష కథానాయికగా రాణిస్తుంది. లేసా లేసా సినిమా తర్వాత జోడి చిత్రంలో సిమ్రాన్ స్నేహితురాలిగా కనిపించింది.

Trisha Krishnan Birthday: దశాబ్దాల కెరీర్‏లో ఎన్నో వివాదాలు.. ఇప్పటివరకు త్రిష సంపాదించిన ఆస్తులు ఎంతంటే..
Trisha Birthday
Follow us

|

Updated on: May 04, 2024 | 2:43 PM

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో కుర్రహీరోయిన్లకు టెన్షన్ పెట్టిస్తోన్న హీరోయిన్ త్రిష. దాదాపు 25 ఏళ్ల సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఏలేస్తుంది. నాలుగు పదుల వయసులోనూ చేతినిండా సినిమాలతో సత్తా చాటుతుంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషలలో తిరుగులేని హీరోయిన్‏గా రాణిస్తుంది. ఈరోజు త్రిష 41వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ బ్యూటీకి తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే త్రిష రేర్ ఫోటోస్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. 1983 మే 4న చెన్నైలోని మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు జన్మించింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తి కలగడంతో మోడలింగ్ రంగంవైపు అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే మిస్ చెన్నై టైటిల్ గెలుచుకుంది. 1999లో లేసా లేసా సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. 16 ఏళ్ల వయసు నుంచే త్రిష కథానాయికగా రాణిస్తుంది. లేసా లేసా సినిమా తర్వాత జోడి చిత్రంలో సిమ్రాన్ స్నేహితురాలిగా కనిపించింది.

తెలుగులో ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రానికే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలోని స్టార్ హీరోలందరి సరసన నటించింది. కొన్నాళ్ల పాటు నటనకు బ్రేక్ తీసుకున్న త్రిష.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమా త్రిష సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత త్రిషకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతిలో ఐదు సినిమాలతో బిజీగా ఉంది. నివేదికల ప్రకారం .. త్రిష నికర విలువ $10 మిలియన్లు అంటే 2023లో దాదాపు రూ. 85 కోట్లు ఉంటుందని సమాచారం.

ప్రతి సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. పొన్నియన్ సెల్వన్ సినిమాకు దాదాపు రూ.3 కోట్లు పారితోషికం తీసుకుందటచ. ఇక విజయ్ దళపతి సరసన నటించిన లియో చిత్రానికి రూ. 4 కోట్లు తీసుకుందని సమాచారం. ప్రస్తుతం అజిత్ చిత్రానికి రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా నెలకు రూ. 70 లక్షలు.. సంవత్సరానికి రూ. 10 కోట్ల వరకు ఆదాయన్ని సంపాదిస్తుంది. చెన్నైలో రూ. 7 కోట్ల విలువైన ఇంటిని కలిగి ఉంది. అలాగే హైదరాబాద్ లో రూ. 6 కోట్ల విలువైన ఇల్లు కలిగి ఉంది. అలాగే నటి వద్ద నాలుగు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రూ. 80 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ , రూ. 75 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ , రూ. 60 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్, రూ. 5 విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఉన్నట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.