AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Rebba: ఎన్టీఆర్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన ఈషా రెబ్బ

ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లి పాత్రలో ఈషా రెబ్బ నటించి మెప్పించింది.

Eesha Rebba: ఎన్టీఆర్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన ఈషా రెబ్బ
Eesha Rebba
Rajeev Rayala
|

Updated on: May 18, 2024 | 7:47 AM

Share

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు.. చిన్న రోల్ వచ్చిన చాలు అని ఎదురుచూసే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఈ బ్యూటీ ఎన్టీఆర్ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని అంటుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లి పాత్రలో ఈషా రెబ్బ నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటుంది ఈ చిన్నది. ఇంతకు ఈషా రెబ్బకు ఏం అన్యాయం జరిగింది.?

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న రోల్ కనిపించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది, అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ హీరోయిన్ గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా.. జూ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలోనూ నటించింది. అయితే ఆ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా ఆరోపించింది. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ నిరాశపరిచాడు అని తెలిపింది.

2018లో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా విడుదలైంది. రాయలసీమ కుటుంబ కలహాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈషా రెబ్బా కూడా నటించింది. ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించింది. ఈషా రెబ్బాను త్రివిక్రమ్ సంప్రదించగా.. ఈ సినిమాలో నువ్వే సెకండ్ హీరోయిన్ అని చెప్పారట. ఈషా రెబ్బా సినిమా కోసం చాలా సన్నివేశాలు చేసిందట.  సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఒక పాట కోసం బుల్లెట్ ఎలా నడపాలో కూడా ఇషా నేర్చుకుంది, అయితే సినిమా విడుదలయ్యాక, ఆమె పాత్ర చాలా తక్కువ సేపు ఉంచారు. ఈషా కూడా తారక్ ను ప్రేమిస్తుందట. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జూ ఎన్టీఆర్, ఇషా మధ్య చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో చాలా కామెడీ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే దర్శకుడు ఆ సన్నివేశాలను కత్తిరించినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన వారు మాత్రం ఈషా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు. దీంతో ఈషాకు చాలా బాధేసిందట. తన సీన్స్ కట్ చేయడంపై దర్శకుడు త్రివిక్రమ్‌ని ఈషా వ్యక్తిగతంగా ప్రశ్నించగా.. ‘సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా మీరే ప్రమోట్ చేసుకుంటే సరిపోదు’ అని త్రివిక్రమ్ సమాధానమిచ్చారని ఈషా తెలిపింది. ఇప్పుడు ఈ అమ్మడి కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో దుమారం రేపుతున్నాయి.

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!