ఓపెన్ అయిపోయిన జాన్వీ.. బాయ్ ఫ్రెండ్ గురించి అలా అనేసిందేంటి!
TV9 Telugu
17 May 2024
అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. అతి తక్కువ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ కూడా ఒకరంటే అతిశయోక్తి లేదు.
అన్నట్లు త్వరలోనే తెలుగు తెరపై కూడా కనిపించనుంది జాన్వీ. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న దేవరలో ఈ ముద్దుగుమ్మే మెయిన్ హీరోయిన్.
సినిమాల సంగతి పక్కన పెడితే.. లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ తదితర విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది జాన్వీ కపూర్.
ముఖ్యంగా తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి పార్టీలు, ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లలో కలిసే కనిపిస్తోందీ అందాల తార.
అయితే ఎప్పుడూ శిఖర్ పహారియా గురించి పబ్లిక్ గా మాట్లాడని జాన్వీ తొలిసారిగా తన బాయ్ ఫ్రెండ్ గురించి మొదటిసారిగా నోరు విప్పింది
తన 15 ఏళ్ల వయసులోనే శిఖర్ తన లైఫ్ లోకి వచ్చాడంటూ, తామిద్దరం బాగా సన్నిహితంగా ఉంటామంటూ ఓపెన్ అయిపోయింది జాన్వీ.
'నా కలలను శిఖర్ తనవిగా ఫీలవుతాడు. అలాగే నేను కూడా అతని కలలు నా సొంతం అనుకుంటా' అంటూ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేసింది జాన్వీ.
ఇక్కడ క్లిక్ చేయండి..