అంత ఈజీ ఏం కాదు.. నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వచ్చా: జాన్వీ కపూర్
12 June 2024
బీ టౌన్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగుతెరకు పరిచయం కాబోతుంది.
జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమా మొదటిది కాగా రామ్ చరణ్ తో మరో సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.!
వీటితో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో సైతం బిజీగా గడిపేస్తుంది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ వయ్యారి.. మొన్ననే 'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' మూవీతో అలరించింద
ి.
ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే.. ఇండస్ట్రీలో కథ దగ్గర నుండి రిలీజ్ వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.
అలాంటి చాలెంజెస్‌ని ఫేస్ చేసిన సినిమానే మిస్టర్ అండ్ మిసెస్ మహి అని అంటున్నారు నటి జాన్వీ కపూర్.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో రాజ్‌కుమార్ రావు హీరోగా నటించారు. జాన్వీ హీరోయిన్.
మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడి క్రికెట్ నేర్చుకున్నానని అన్నారు జాన్వీ కపూర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి