బహుశా బ్రహ్మ పోరాటమే.. స్వర్గానికి బదులు భువిపైకి జాలువారింది ఈ భామ..
TV9 Telugu
17 May 2024
17 అక్టోబర్ 1992 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జన్మించింది వయ్యారి భామ ప్రణీత సుభాష్.
కన్నడ, తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళం చిత్రాల్లో కథానాయకిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అందాల తార.
పోర్కి అనే ఓ కన్నడ చిత్రంలో ఆశిష్ విద్యార్ధి సరసన హీరోయిన్ గా చలనచిత్రం అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
2010లో ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ.
తర్వాత సిద్దార్డ్ కి జోడిగా కామెడీ రొమాంటిక్ డ్రామా చిత్రం బావలో ఆకట్టుకుంది వయ్యారి ప్రణీత సుభాష్.
తర్వాత అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాల్లో కనిపిందించింది.
చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో అలనాటి హీరోయిన్ కృష్ణ కుమారి పాత్రలో అతిధి పాత్రలో ఆకట్టుకుంది ఈ భామ.
30 మే 2021న ఒక సన్నిహిత వేడుకలో వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. జూన్ 2022లో ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి