ఎండాకాలం రాగానే మనం ఆ వేడిని తట్టుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉంటాం.
కానీ.. మనకు అందుబాటులో ఉండే మరో అద్భుతమైన దానిని మాత్రం మర్చిపోతున్నాం. అదే సబ్జా వాటర్. మనకు మార్కెట్లో ఈ సబ్జా గింజలు చాలా ఈజీగా లభిస్తాయి.
ఈ సబ్జా గింజల్లో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలలోని పిండి పదార్థాలు జీవక్రియను ప్రోత్సహిస్తాయి.
మూత్రపిండాలు, గుండె , కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడతాయి. దీన్ని రోజూ తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది, కడుపు వ్యాధులను దూరం చేస్తుంది.
ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది . ఎముకలు, కండరాలు, చర్మాన్ని బలోపేతం చేయడానికి, శరీర పనితీరును మెరుగుపరచడానికి, శరీరంలో ఎంజైమ్‌లు, హార్మోన్లు ,ఇతర రసాయనాల ఉత్పత్తిని పెంచుతాయి.
సబ్జా గింజలు తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉంటాయి. స్లీప్ అప్నియా, కీళ్ల వ్యాధులు, కొలెస్ట్రాల్, రక్తపోటు , క్యాన్సర్‌ను తగ్గించడానికి ఈ విత్తనాలను మీ దినచర్యలో చేర్చుకోండి.
సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుంది. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తాయి. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సబ్జా గింజలు గుండె సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు.. ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గవచ్చు.