ఈ లక్షణాలు ఉంటె గుండె సమస్యలు ఉన్నట్టేనా.?

TV9 Telugu

04 May 2024

తరచుగా ఛాతీ నొప్పి వస్తే అదే గుండె జబ్బులను సూచిస్తుందని తెలుసుకోవాలి. వెంటనే వైద్యుని సంప్రదిస్తే సమస్య నుంచి బయట పడవచ్చు.

దీన్ని గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకోవడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయని చెబుతున్నారు వైద్యారోగ్య నిపుణులు.

ఛాతీ నొప్పి తర్వాత వాంతులు అయితే మాత్రం గుండె జబ్బులకు సూచన అని గుర్తించాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అటువంటి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గర చికిత్స తీసుకోండి.అప్పుడు సమస్య నుంచి బయటపడొచ్చు.

కడుపునొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. వాటిలో ప్రధాన కారణం మాత్రం ఆహారం సరిగా జీర్ణం అవకపోవడం.

అయితే ఇది అధికమైతే మాత్రం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలంటి పరిస్థితిలో వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

తరచూ దవడలో నొప్పితో నొప్పితో బాధపడితే మాత్రం వెంటనే డాక్టర్ ని కలవండి. అది గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది.

ఏసీ గదిలోనో, చల్లని ప్రదేశాల్లనో ఎలాంటి శ్రమ లేకుండా ఆకస్మికంగా చెమటలు పడితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.