ఈ విటమిన్ లోపం ఉన్నా రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది

04 May 2024

TV9 Telugu

Pic credit - TTD

శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గితే రక్తహీనత లేదా ఎనీమియా అంటారు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

రక్తహీనత సమస్య

ఐరెన్ లోపం ఉండే సాధారణంగా హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గుతుందనేది ఒక కారణం. అయితే దీని వెనుక మరొక విటమిన్ లోపం కూడా ఉంది.

ఐరెన్ లోపం 

శరీరంలో విటమిన్ B12 లోపం ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల ఈ విటమిన్ లోపం రక్తహీనత ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

విటమిన్ బి12

రక్తహీనత ఉంటే అలసట, తల తిరగడం, చర్మం పసుపు లేదా తెల్లగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. గుండె కొట్టుకోవడంలో తేడా వంటి లక్షణాలు కనిపిస్తాయి

లక్షణాలు ఏమిటి

మహిళలు తమ నెలసరి సమయంలో ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతారు.  డెలివరీ తర్వాత ఐరెన్ లోపం  రక్తహీనతకు కారణం.

మహిళల్లో రక్తహీనత ఎందుకు

సాల్మన్ చేప, గుడ్డు, రొయ్యలు మొదలైన నాన్-వెజ్ ఫుడ్స్‌లో విటమిన్ బి12 ఉంది. అంతేకాదు బ్రకోలీ, బీట్‌రూట్, మష్రూమ్ వంటి ఆహారాలను కూడా తీసుకోవాలి. 

తినాల్సిన ఆహారం 

ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుతే పాలకూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలు, ఎండుద్రాక్ష, రాగులు, కరివేపాకు, అంజీర్ వంటి వాటిని తినే ఆహారంలో చేర్చుకోవాలి.

ఐరన్ రిచ్ ఫుడ్స్