కుళ్ళిన గుడ్డును గుర్తించండిలా..

TV9 Telugu

04 May 2024

చాలా రోజుల పాటు గుడ్లను నిల్వ ఉంచి అవి బాగున్నాయా? లేదా? అని గుర్తించాలంటే  సింపుల్‌ చిట్కాలను అనుసరించవచ్చు.

మీరు పాడైపోయిన గుడ్లను వాసన ద్వారా గుర్తించవచ్చు. ఒక పాత్రలో గుడ్డును పగులగొట్టి గుడ్డు వాసన చూడండి.

రెగ్యులర్‌ స్మెల్ కాకుండా మరో రకమైన చెడు వాసన వస్తున్నట్లయితే మాత్రం ఆ గుడ్లు పాడైపోయినట్లే అని గుర్తించాలి.

ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో గుడ్డును ముంచండి. గుడ్డు నీటిలో మునిగినట్లయితే అది మంచిగా ఉన్నట్లే.

ఒకవేళ గుడ్డు నీటితో తేలితే మాత్రం అది పాడైపోయినట్లే నని భావించాలి. అదేవిధంగా గుడ్డు నీటిలో నిటారుగా నిలబడినా అది చెడిపోయినట్లే.

పాడైపోయిన గుడ్లను ఇంకోలా కూడా గుర్తుపట్టవచ్చు. ఇందుకోసం మీరు గుడ్డును చెవి దగ్గర ఉంచుకుని షేక్‌ చేయాలి.

రెగ్యులర్‌గా కాకుండా గుడ్డు నుంచి శబ్దాలు వస్తుంటే మాత్రం ఆ గుడ్డు పూర్తిగా పాడైపోయినట్లేనని గ్రహించాలి.

గుడ్లలో ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే చెడిపోయిన గుడ్లను తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.