AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran: క్లాసికల్ డాన్స్‏తో మెస్మరైజ్ చేసిన శ్రియా.. రెండు కళ్లు చాలవు.. వీడియో వైరల్..

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉంటుంది. మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు.. నాలుగు పదుల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై క్లాసికల్ డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. లెహాంగాలో శ్రియా చేసిన నృత్యం అక్కడున్నవారి హృదయాలను తాకింది.

Shriya Saran: క్లాసికల్ డాన్స్‏తో మెస్మరైజ్ చేసిన శ్రియా.. రెండు కళ్లు చాలవు.. వీడియో వైరల్..
Shriya
Rajitha Chanti
|

Updated on: May 04, 2024 | 2:20 PM

Share

ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన శ్రియా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉంటుంది. మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు.. నాలుగు పదుల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై క్లాసికల్ డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. లెహాంగాలో శ్రియా చేసిన నృత్యం అక్కడున్నవారి హృదయాలను తాకింది.

వరీందర్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో శ్రియ ఒక ఈవెంట్‌లో క్లాసికల్ డ్యాన్స్ చేసింది. అందాల తార మనోహరమైన కదలికలు, ఆకట్టుకునే భావాలతో ఆకట్టుకుంది. ఐవరీ లెహంగా స్కర్ట్ సెట్‌లో మహారాణిగా రాయల్ లుక్ లో కనిపిస్తుంది. అలాగే తక్కువ ఆభరణాలు ధరించి మరింత సింపుల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రియా చేసిన క్లాసికల్ డాన్స్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. గతంలో శ్రియా శరణ్ క్లాసికల్ డాన్సర్ గా శిక్షణ తీసుకుంది. మొదట కథక్, రాజస్తానీ, జానపద నృత్యాలలో తన తల్లి వద్ద శిక్షణ తీసుకుంది.

గతేడాది మాస్కోలో మొదటిసారిగా కథక్ ప్రదర్శనను అందించింది. అందుకు సహయం చేసిన తన భర్తకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపింది. “మాస్కోలో నా మొదటి కథక్ ప్రదర్శన. @నూతన్‌పట్‌వర్ధన్ కొరియోగ్రాఫ్ చేసారు, దీన్ని సాకారం చేసినందుకు @andreikoscheev ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ఇక శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు రాధతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోస్ పంచుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us