AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో హిట్.. ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోన్న మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇక గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ కేవలం రెండు రోజుల్లోనే టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది.

OTT Movie: థియేటర్లలో హిట్.. ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోన్న మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ  ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 19, 2026 | 10:19 AM

Share

గత వారం పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. సమంత ‘మా ఇంటి బంగారం’, సాయిపల్లవి ‘ఏక్ దిన్’, వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, రఘ కుంచె గేదెల రాజు వంటి తెలుగు సినిమాలతో పాటు దర్శన్ ‘ద డెవిల్’ సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే వీటితో పాటు గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఒక మలయాళం సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా స్టోరీ విషయానకి వస్తే.. కేరళ – తమిళనాడు సరిహద్దుల్లోని వేలంపాలయం అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇక్కడి వారందరికీ కబడ్డీ అంటే ప్రాణం. హీరో కూడా పేరు మోసిన కబడ్డీ ప్లేయర్. అతని ముగ్గురు బాల్య స్నేహితులు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి టోర్నమెంట్స్ అన్నీ గెలుస్తుంటారు. అయితే ఒక టోర్నీలో హీరో టీమ్ లోకల్ మాఫియాకు సంబంధించిన టీమ్‌ ను ఘోరంగా ఓడిస్తారు. దీంతో మాఫియా లీడర్ ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక హీరోపై పగ పెంచుకుంటాడు. క్రమంగా అతని స్నేహితులు క్రైమ్, అక్రమ ఫైనాన్స్, గ్యాంగ్ వార్ల వలయంలో చిక్కుకుపోతారు.

చివరకు డబ్బు, భయం వల్ల ఒకప్పటి ప్రాణ స్నేహితులు కాస్త శత్రువులగా మారుతారు. చివరకు హీరో ఒంటరిగా మిగిలిపోతాడు. మరి చివరకు ఏమైంది? హీరో వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు బాల్టి (Balti). ఈ మధ్యనే ధృడం వంటి సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించిన హీరో షేన్ నిగమ్ ఇందులో కథానాయకుడు. పైగా అతనికిది 25వ సినిమా. ఉన్ని శివలింగం తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ లో ఓటీటీలో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి బాల్టి ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలుగులో కూడా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల