AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క ఆకుతో వందల రోగాలు నయం.. మన పూర్వీకుల 100ఏళ్ల హెల్త్ సీక్రెట్ ఇదిగో..

తమలపాకు కేవలం తాంబూలానికి మాత్రమే పరిమితం కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, గ్యాస్, మలబద్ధకం తగ్గించడం, దంతాలు-చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడం, మైగ్రేన్, కీళ్ల నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడే ఔషధ గుణాలు కలిగిన ఆకుగా గుర్తింపు పొందింది.

ఈ ఒక్క ఆకుతో వందల రోగాలు నయం.. మన పూర్వీకుల 100ఏళ్ల హెల్త్ సీక్రెట్ ఇదిగో..
Betel Leaf Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2026 | 10:18 AM

Share

తమలపాకు, భారతీయ సంస్కృతిలో తాంబూలంగా, శుభకార్యాల్లో భాగంగా సాధారణంగా ఉపయోగించే ఒక ఆకు.. అయితే, దీని ఔషధ గుణాలను చాలామంది తక్కువ అంచనా వేస్తారు.. అయితే, ఆయుర్వేద నిపుణులు.. తమలపాకులో దాగి ఉన్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను లోతుగా వివరించారు. కేవలం జీర్ణక్రియకు మాత్రమే కాకుండా, అనేక రకాల వ్యాధుల నివారణకు తమలపాకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. తమలపాకుల్లో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, గ్యాస్, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాసకోశ సమస్యలను, దగ్గును తగ్గించడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకులను పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించేవారని.. తమలపాకుల నీరు, రసాన్ని తీసుకునేవారని నిపుణులు పేర్కొంటున్నారు.

జీర్ణక్రియకు అమృతం:

తమలపాకు ప్రధానంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం సరిగా అరగక ఇబ్బంది పడేవారికి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి తమలపాకు రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తమలపాకును నెమ్మదిగా, ఎక్కువసేపు నమిలి మింగడం వల్ల దానిలోని రసాలు జీర్ణ వ్యవస్థలోని అన్ని రసాలను ప్రేరేపించి, జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తాయి. పూర్వ కాలంలో భోజనం తర్వాత తాంబూలం సేవించడం అందుకే ఒక ఆచారంగా ఉండేది.

నోటి – దంతాల ఆరోగ్యం:

తమలపాకు దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది దంతాలను బలపరచడమే కాకుండా, చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది. నోటిలో ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. తమలపాకుతో పాటు సున్నం చేర్చి నమలడం వల్ల అందులోని కాల్షియం ఎముకల బలానికి కూడా తోడ్పడుతుంది.

నొప్పి నివారణలో తమలపాకు:

మైగ్రేన్ తలనొప్పి: మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారికి తమలపాకు ఒక అద్భుత ఔషధం. తమలపాకు రసాన్ని నుదుటిపై లేదా మైగ్రేన్ వచ్చే కణత భాగంలో పూసి మర్దన చేయడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. ఆముదం నూనెతో తలనొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేసి, వేడి చేసిన తమలపాకును పెట్టడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు. తమలపాకును నెమ్మదిగా నమలడం వాంతులు, వికారం వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

కీళ్ల నొప్పులు: ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి వంటి కీళ్లవాత సమస్యలకు తమలపాకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. తమలపాకును దంచి రసాన్ని నొప్పులున్న చోట మర్దన చేసి, కాపడం పెట్టడం లేదా పేస్ట్‌ను అలాగే అప్లై చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. వేడి చేసిన తమలపాకులను నూనెతో మర్దన చేసిన తర్వాత కీళ్లపై అంటించడం వల్ల నొప్పిని తగ్గిస్తుంది. ఉడికించిన తమలపాకులను వస్త్రంలో కట్టి కాపడం పెట్టడం వల్ల కండరాల లోపలి నొప్పులు కూడా తగ్గుతాయి.

శ్వాసకోశ సమస్యలకు పరిష్కారం:

దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు తమలపాకు ఒక పరిష్కారం. దగ్గు ఉన్నప్పుడు తాంబూలం సేవించడం లేదా ఛాతిపై ఆముదం లేదా ఆవనూనెతో మర్దన చేసి, వేడి చేసిన తమలపాకులను అంటించడం వల్ల దగ్గు, ఉబ్బసం, ఆయాసం తగ్గుతాయి. తమలపాకు వేళ్లను, తుంగముస్తలతో కలిపి పేస్ట్ చేసి తీసుకోవడం ద్వారా కూడా దగ్గు తగ్గుతుంది.

శీతాకాల ఆరోగ్య రక్షణ:

పూర్వ కాలంలో, పాలను చిలికి తీసిన వెన్నను నెయ్యిగా మార్చేటప్పుడు తమలపాకులను వేసి కాచేవారు. ఈ పద్ధతి ద్వారా తయారైన నెయ్యిని సేవించడం వల్ల శరీరంలో వాతం చేరకుండా నిరోధించబడుతుంది. ఇది కఫాన్ని, బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసి గొంతును శుభ్రపరుస్తుంది. స్వరానికి స్పష్టతను ఇస్తుంది. టాన్సిల్స్, అడినాయిడ్స్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. వర్షాకాలం, శీతాకాలంలో కనీసం వారానికి రెండుసార్లు ఈ నెయ్యిని వాడటం ద్వారా శరీరం రోగనిరోధక శక్తిని పెంచుకొని సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.

తమలపాకు కేవలం కాలక్షేపం కోసం కాదు, ఇది అనేక ఔషధ గుణాలున్న ఒక శక్తివంతమైన హెర్బ్. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా ఎన్నో వ్యాధులను దూరం చేయవచ్చు. ప్రతి ఇంట్లో తమలపాకులను ఉంచుకొని, దాని సువాసనను పీల్చడం కూడా ముక్కు దిబ్బడ వంటి సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇవి ఆయుర్వేదంలో పేర్కొనే సంప్రదాయ ఉపయోగాలు మాత్రమే. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే, లేదా మందులు వాడుతున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఇలాంటి చిట్కాలను అనుసరించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలు
OTTని షేక్ చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్.. వీకెండ్‌కు సినిమా సెట్టు
OTTని షేక్ చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్.. వీకెండ్‌కు సినిమా సెట్టు
ఈ ఒక్క ఆకుతో వందల రోగాలు నయం.. మన పూర్వీకుల హెల్త్ సీక్రెట్ ఇదిగో
ఈ ఒక్క ఆకుతో వందల రోగాలు నయం.. మన పూర్వీకుల హెల్త్ సీక్రెట్ ఇదిగో
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..