AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తినే ఆహారంలో ఈ పండుని చేర్చుకోండి.. ఆరోగ్యకరమైన నిగనిగలాడే చర్మం, ఒత్తైన, పొడవైన జుట్టును సొంతం చేసుకోండి..

Black Grapes Benefits: ప్రకృతి ప్రసాదించిన పోషకాహారాల్లో ఒకటి పండ్లు(Fruits). ఇవి  రుచికరమైనవి మాత్రమే కాదు... అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. పండ్లలో ఒకటి ద్రాక్ష(Grapes).. ఈ ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి..

Health Tips: తినే ఆహారంలో ఈ పండుని చేర్చుకోండి.. ఆరోగ్యకరమైన నిగనిగలాడే చర్మం, ఒత్తైన, పొడవైన జుట్టును సొంతం చేసుకోండి..
Health Benefits Of Black Gr
Surya Kala
|

Updated on: Feb 15, 2022 | 5:33 PM

Share

Black Grapes Benefits: ప్రకృతి ప్రసాదించిన పోషకాహారాల్లో ఒకటి పండ్లు(Fruits). ఇవి  రుచికరమైనవి మాత్రమే కాదు… అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. పండ్లలో ఒకటి ద్రాక్ష(Grapes).. ఈ ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. అయితే ఎక్కువగా ఆకు పచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్షలు ప్రజలకు బాగా అందుబాటులో ఉన్నాయి. ఈ ద్రాక్ష పండ్లను అలాగే తింటారు. లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, వైన్ తయారుచేసి వినియోగిస్తారు. అత్యంత ప్రజాదరణ కలిగిన రుచికరమైన నల్లని ద్రాక్ష తినడం వలన అధిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నల్ల ద్రాక్షలో చర్మం, జుట్టుకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.  ఫిట్‌నెస్ కోసం యోగ, వ్యాయామం చేసే వారు తప్పనిసరిగా నల్లద్రాక్షను తినే ఆహారంలో భాగంగా చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం:

మెరిసే చర్మం: రెస్వెరాట్రాల్ అనే  యాంటీఆక్సిడెంట్ వలన ద్రాక్ష నల్లని రంగులో కనిపిస్తుంది. ఈ రెస్వెరాట్రాల్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే..  ద్రాక్ష అంత ముదురు రంగులో కనిపిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక నల్ల ద్రాక్ష చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల ద్రాక్షలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  ముఖంపై మొటిమలని నివారిస్తుంది. ఫేస్ నిగనిగలాడేలా చేస్తుంది.

ఒత్తైన, పొడవాటి జుట్టు: నల్ల ద్రాక్షలో అధిక మొత్తంలో విటమిన్ ‘ఇ’ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అందువలన జుట్టును బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యకరంగా పెరుగేలా చేస్తాయి. తలకు మెరుగైన రక్త ప్రసరణ జరగడం వలన చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు రంగు మారడం వంటి వాటిని నియంత్రిస్తుంది.

నల్ల ద్రాక్ష-షుగర్ పేషేంట్స్:  నల్ల ద్రాక్షను మితంగా.. వైద్యుల సలహాతో తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ప్రయోజనకారి.  రెస్వెరాట్రాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది . రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

గర్భిణీలు-నల్ల ద్రాక్ష: గర్భధారణ సమయంలో నల్ల ద్రాక్ష తినడం వల్ల అధిక రక్తపోటు పెరుగుతుంది. ఒకొక్కసారి అలెర్జీలు లేదా కడుపులో  పూతకి కూడా దారితీయవచ్చు. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో నల్ల ద్రాక్ష తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడడం, మలబద్ధకం నుండి ఉపశమనం, బలమైన రోగనిరోధక వ్యవస్థ వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కనుక గర్భిణీలు నల్ల ద్రాక్షను డాక్టర్ల సలహాను అనురించి తినే ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

(Note: ఈ ఆర్టికల్‌లో మేము సాధారణ పాఠకుని ఆసక్తిని అనుసరించి, సలహాతో కూడిన సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది..)

Also Read:

బాలయ్యకు కూతురుగా క్రేజీ హీరోయిన్.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ భామ..