Health Tips: వినాయక చవితికి మాత్రమే కనిపించే పండు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా వదలరు..
యాపిల్, అరటి, దానిమ్మ పండ్ల గురించి తెలుసు. వాటి ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. అయితే వాటితో సమానంగా పోషకాలున్న పండు వెలగపండు. వినాయకుడి పూజలో ఎక్కువగా కనిపించే ఈ పండు రుచిలో వగరు, పులుపు, తియ్యదనం కలగలిసి ఉంటుంది. బయట గట్టిగా కనిపించే ఈ పండు లోపల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ సమస్యలను తొలగించడంలో, గుండె ఆరోగ్యానికి తోడ్పడటంలో ఈ పండుకు ప్రత్యేక స్థానం ఉంది. వెలకట్టలేని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పండు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ పండులో ఉండే పీచు పేగుల కదలికలు మెరుగుపరిచి మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. వెలగపండు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో కొలెస్ట్రాల్, సోడియం తక్కువ. పొటాషియం ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
పోషకాల గని
వెలగపండులో విటమిన్ సి, బీటా-కెరోటిన్, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి ఎన్నో ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియకు దివ్యౌషధం
తరచుగా అజీర్ణంతో బాధపడేవారికి వెలగపండు మంచి ఔషధం. ఈ పండులో ఉండే పీచు పేగుల కదలికలు మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
వెలగపండులో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరానికి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుండెకు మంచిది
వెలగపండులో కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎలా తినాలి?
వెలగపండును నేరుగా తినవచ్చు. పచ్చడి, జ్యూస్ లేదా స్మూతీలా కూడా తీసుకోవచ్చు. వెలగపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించి, సలహా తీసుకోవటం మంచిది.




