AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exercises Tips: రోజంతా కూర్చొనే పని చేస్తున్నారా.. అయితే ఈ వ్యాయామాలు మీకోసమే!!

మీరు రోజంతా కూర్చొని పని చేస్తుంటారా.. ఇది చాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న విషయం మీకు తెలుసా? అవును రోజంతా కూర్చొని పని చేయడం వల్ల ఆరోగ్యం పరంగా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ధూమపానం, ఎంత ప్రమాదకరమో.. కూర్చొని పని చేయడం వల్ల కూడా అంతే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజంతా ఒకే భంగిమలో కూర్చొవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. అధిక బరువు, వెన్ను నొప్పి, పొట్ట రావడం..

Exercises Tips: రోజంతా కూర్చొనే పని చేస్తున్నారా.. అయితే ఈ వ్యాయామాలు మీకోసమే!!
Four Effective Exercises for Sit all Day
Chinni Enni
|

Updated on: Aug 17, 2023 | 3:59 PM

Share

మీరు రోజంతా కూర్చొని పని చేస్తుంటారా.. ఇది చాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న విషయం మీకు తెలుసా? అవును రోజంతా కూర్చొని పని చేయడం వల్ల ఆరోగ్యం పరంగా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ధూమపానం, ఎంత ప్రమాదకరమో.. కూర్చొని పని చేయడం వల్ల కూడా అంతే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజంతా ఒకే భంగిమలో కూర్చొవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. అధిక బరువు, వెన్ను నొప్పి, పొట్ట రావడం, తలనొప్పి వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. వాటికి తగ్గట్టుగా వర్కౌట్స్ చేయకపోతే ఇక అంతే. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వ్యాయామాలేంటో తెలుసుకుందాం.

1. లంచ్ స్ట్రెచ్:

కూర్చొని వర్క్ చేసే వారు లంచ్ స్ట్రెచ్ చేయడం వల్ల చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

దీన్ని ఎలా చేయాలంటే:

-నిటారుగా నిల్చుని మీ పాదాలని హిప్ వెడల్పుగా వేరుగా, అలాగే మీ తుంటిపై చేతులను ఉంచాలి. ఆ తర్వాత మీ కుడికాలును ముందుకి పెట్టాలి. బ్యాలెన్స్ కోసం మీ మోకాళ్లని చేతులని ఉంచండి. ఫస్ట్ టైం చేసిన వారు ఓ 10 సెకన్ల పాటు ఇలా ఉంచాలి. ఇలా రోజుకు ఓ సారైనా చేస్తూ ఉండాలి.

2. డౌన్ ఫేసింగ్ డాగ్ పోజ్:

ఇది ఎలా చేయాలంటే:

నిలారుగా నిలబడి, మీ చేతులను నేలపై పెట్టాలి. ఈ విధంగా శరీరం మధ్య భాగాన్ని పైకి లేపడానికి జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత మీ తుంటిని పైకి ఎత్తండి. మీ మోచేతులు, మోకాళ్లని నిటారుగా ఉండేలా పిరమిడ్ పోజ్ వచ్చేలా చేయాలి. మీ కళ్లు మీ బొడ్డును చూసేలా ఉండాలి.

ఈ డౌన్ ఫేసింగ్ డాగ్ పోజ్ కనీసం రోజుకు ఒకసారైనా చేయాలి. ఇది చేయడం ద్వారా మెడ ఒత్తిడి, మెన్ను నొప్పిని తగ్గించేందుకు సహాయ పడుతుంది.

3. రివర్స్ ప్లాంక్:

ఈ యోగా భంగిమ కోసం ముందుగా చాపై కూర్చోవాలి. మీ కాల్లని ముందుకు చాచి అరచేతులని వెనక్కి నేలపై ఉంచాలి. మీ తుంటి భాగాన్ని పైకి నొక్కి.. పాాలను కలిపి నేలవైపు చూడాలి. మీ ఛాతీ, శరీరం పైకి లేపి సరళ లేఖలో ఉండాలి. మీ శ్వాసని కాసేపు బిగపట్టి బాడీ రెస్ట్ పొందినప్పుడు మీ తుంటిని తగ్గించాలి.

ఇలా చేయడం ద్వారా కాళ్లు, శరీర వెనుక కండరాలని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

4. చెస్ట్ ఓపెనర్:

ఇది చేసేందుకు మీ పాదాలను హిప్ వెడల్పుగా ఉంచి.. మీ చేతులను మీ తుంటి వెనక్కి నుంచి నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత మీ బాడీని వంచి, అదే సమయంలో మీ చేతులని శరీరానికి లంబంగా పైకి లేపాలి. వేళ్లు పైకప్పుకి ఎదురుగా ఉంచాలి.

ఈ వర్కౌట్ చేయడం వల్ల భుజం కండరాలని, బ్యాక్ బలంగా చేసేందుకు సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి