AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall Control Tips: వారంలో రెండుసార్లు ఈ ఆయిల్ వాడండి.. హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టండి!!

చిన్నారులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టురాలడం ప్రధానంగా ఉంటోంది. పాతికేళ్ల వయసైనా రాకుండానే జుట్టు ఊడిపోయి.. బట్టతలలు కనిపిస్తున్నాయి. పోషకాహార లోపం ఒక కారణమైతే.. పెరుగుతున్న వాయు కాలుష్యం మరో కారణం. ఎక్కువగా జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మార్కెట్లో వచ్చే రకరకాల షాంపూలు, నూనెలు జుట్టుకు వాడటం వల్ల కూడా అధికంగా జుట్టురాలిపోతుంటుంది. ఇందుకు పరిష్కారం మనచుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉంది. ఈ ఆయిల్ ను స్వయంగా మీరే తయారు చేసుకుని వాడితే..

Hair Fall Control Tips: వారంలో రెండుసార్లు ఈ ఆయిల్ వాడండి.. హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టండి!!
Hair Loss Problem
Chinni Enni
|

Updated on: Aug 16, 2023 | 2:45 PM

Share

చిన్నారులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టురాలడం ప్రధానంగా ఉంటోంది. పాతికేళ్ల వయసైనా రాకుండానే జుట్టు ఊడిపోయి.. బట్టతలలు కనిపిస్తున్నాయి. పోషకాహార లోపం ఒక కారణమైతే.. పెరుగుతున్న వాయు కాలుష్యం మరో కారణం. ఎక్కువగా జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మార్కెట్లో వచ్చే రకరకాల షాంపూలు, నూనెలు జుట్టుకు వాడటం వల్ల కూడా అధికంగా జుట్టురాలిపోతుంటుంది. ఇందుకు పరిష్కారం మనచుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉంది. ఈ ఆయిల్ ను స్వయంగా మీరే తయారు చేసుకుని వాడితే.. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయి.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

అంతేకాదు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్య కూడా నయమవుతుంది. ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి ? ఎలా వాడాలి ? ఇందుకు ఏయే పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాస్ ఆవ నూనె, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ కాళోంజి విత్తనాలు, 4 రెబ్బల కరివేపాకు, 4 మందాల ఆకులు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు ఈ నూనె తయారీకి వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో వాడే ప్రతి పదార్థంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ముందుగా ఒక గిన్నెలో ఆవ నూనె పోసి.. అందులోనే ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ కాళోంజి విత్తనాలు, 4 రెబ్బల కరివేపాకు, 4 మందాల ఆకులు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి స్టవ్ పై పెట్టి.. 15 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టి.. నూనెను వడగట్టుకోవాలి. ఈ నూనెను ఒక సీసాలో పోసుకోవాలి. ఇది 15 రోజులపాటు నిల్వ ఉంటుంది.

ఇలా తయారు చేసుకున్న నూనెను కుదుళ్లనుంచి చివరి వరకూ పట్టించాలి. కుదుళ్లలోకి నూనె ఇంకేలా మర్దనా చేసుకోవాలి. ఒక గంట తర్వాత కుంకుడు కాయలు లేదా రసాయనాలు లేని హెర్బల్ షాంపూతో తలంటుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ నూనెను తలకు పట్టించి.. మర్దనా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గి.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి