Dry Fruits In Summer: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అద్భుత ప్రయోజనాలు.. అనారోగ్య సమస్యలు మటుమాయం..

ఎండాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ కాలంలో తీసుకునే ఆహారం.. డ్రింక్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం.

Dry Fruits In Summer: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అద్భుత ప్రయోజనాలు.. అనారోగ్య సమస్యలు మటుమాయం..
Dry Fruits
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 27, 2022 | 4:39 PM

ఎండాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ కాలంలో తీసుకునే ఆహారం.. డ్రింక్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వేసవిలో డ్రైఫ్రూట్స్ (Dry Fruits) తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఇవి మెదడు నుంచి గుండె వరకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే చాలా మంది ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినకుండా ఉంటారు. వాతావరణం ఎలా ఉన్నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్‌ను తినాలని వైద్యులు అంటున్నారు. అలాగే వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినే విధానం కాస్త భిన్నంగా ఉంటుందని.. డ్రై ఫ్రూట్స్ ప్రభావం చాలా వేడిగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎండాకాలంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఇలా తీసుకోవడం వలన వేడి పెరగదు. వేసవిలో ఏ డ్రై ఫ్రూట్‌ని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో బాదం ఎలా తినాలి.. బాదం పప్పు ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. ఈ కారణంతోనే చలికాలంలో బాదంపప్పు ఎక్కువగా తీసుకోవగా తీసుకుంటారు. కానీ వేసవిలో బాదంపప్పును తినాలనుకుంటే ముందుగా వాటిని నానబెట్టి తినాలి. బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే తొక్క తీసి తినాలి. ఇలా తినడం వలన శరీరానికి హాని కలిగిదు. పెద్దలు వేసవిలో రోజుకు 3 నుండి 4 బాదంపప్పులను తినాలి. పిల్లలకు రోజుకు 2 బాదంపప్పుల కంటే ఎక్కువ తినిపించవద్దు.

ఎండాకాలంలో ఎండు ద్రాక్ష ఎలా తినాలి.. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్‌లో అనేక రకాల ఎండుద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బ్లాక్ రైసిన్‌లు, రెడ్ రైసిన్‌లు, గోల్డెన్ రైసిన్‌లు. అన్ని రకాల ఎండుద్రాక్షల రుచి వేడిగా ఉంటుంది. అందుకే ఎండాకాలంలో నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండుద్రాక్ష ప్రభావం సాధారణమవుతుంది.

ఎండుద్రాక్షలో ఐరన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కానీ వేసవిలో ఎండు ద్రాక్షను నానబెట్టిన తర్వాతే తినాలి. ఆయుర్వేదం ప్రకారం అన్ని స్వభావాలు ఉన్న వ్యక్తులు ఎండు ద్రాక్షను నానబెట్టి తినాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష పురుషుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వేసవిలో చిన్న పిల్లలకు 2 నానబెట్టిన ఎండు ద్రాక్షలను మాత్రమే తినిపించాలి. పెద్దలు ఒక రోజులో 5 నానబెట్టిన ఎండుద్రాక్షలను తినవచ్చు.

వేసవిలో వాల్ నట్స్ ఎలా తినాలి.. వాల్ నట్స్‏లో ఐరన్, క్యాల్షియం, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వేడిని కలుగచేస్తాయి. కానీ చలికాలంలో వాల్‌నట్‌లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో వాల్ నట్స్ తినాలనుకుంటే వాటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవద్దు.

వేసవిలో అత్తి పండ్లను ఎలా తినాలి.. ఎండిన అత్తి పండ్లను చలికాలంలో మాత్రమే తినాలని చాలా మంది నమ్ముతారు. కానీ వేసవిలో కూడా అత్తి పండ్లను తినవచ్చు. ఇందుకోసం అంజీర పండ్లను తినే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. 1-2 అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ..ఉదయం నిద్ర లేవగానే వీటిని తినాలి. అసలైన అత్తి పండ్ల ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. అయితే నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది

గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనల ఆధారంగా.. ఇతర వెబ్ సైట్స్ ఆధరంగా చేసుకుని మాత్రమే ఇవ్వబడింది. వీటిని అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌