Palm Rash: మీ అర చేతి మీద ఇలాంటి రాషెస్ కనిపిస్తే.. దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతమట

Palm Rash: సర్వసాధారణంగా చేతిలోని గీతాలు, చక్రాలు వంటి ఆధారంగా జ్యోతిష్యులు (Palm History) వ్యక్తుల భవిష్యత్ ను అంచనా వేస్తారు. అయితే అరచేయి భవిష్యత్ లో జరగబోయే..

Palm Rash: మీ అర చేతి మీద ఇలాంటి రాషెస్ కనిపిస్తే.. దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతమట
Red Marks On Palm
Follow us

|

Updated on: Mar 27, 2022 | 12:46 PM

Palm Rash: సర్వసాధారణంగా చేతిలోని గీతాలు, చక్రాలు వంటి ఆధారంగా జ్యోతిష్యులు (Palm History) వ్యక్తుల భవిష్యత్ ను అంచనా వేస్తారు. అయితే అరచేయి భవిష్యత్ లో జరగబోయే సంఘటనలను మాత్రమే కాదు.. మనిషి ఆరోగ్యం గురించి కూడా తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చర్మం(Skin Care) మీద చిన్న చిన్న మచ్చలు, దద్దుర్లు, గజ్జి. తామర వంటి వ్యాధులు సర్వసాధారంగా ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య.. అయితే అరుదుగా అరచేయిలో దురద, దద్దుర్లు వంటివి అనారోగ్యానికి గురవుతుంది. అవును ఎవరికైనా అరచేతులపై ఎర్రటి మొటిమల వంటివి ఏర్పడ్డాయా? అయితే అది అనారోగ్యానికి సంకేతమని.. వెంటనే వైద్యుడ్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అసలు అరచేతిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడడానికి గల కారణం, నివారణ కోసం తీసుకోవాల్సిన చికిత్స గురించి తెలుసుకుందాం..

ఎర్రటి దద్దుర్లకు కారణాలు..

అరచేతులపై దద్దుర్లు.. అధిక ఒత్తిడి, చర్మ సున్నితత్వం, తామర వంటి ఇతర చర్మ సంబంధిత సమస్యల కారణంగా ఏర్పడే అవకాశం ఉంది.  అంతేకాదు ఒకొక్కసారి అరచేయిమీద వేడి బొబ్బలు వంటివి కూడా కనిపిస్తాయి. ఇవి పది, 15 రోజుల్లో తగ్గిపోతాయి.

అరచేతిలో ఎర్రని మొటిమలు ,  బొబ్బర్లు చాలా ఇబ్బంది పెడతాయి.  వైద్య సలహా మేరకు చికిత్స తీసుకుంటూ.. రోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది.

Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం  కొందరు నిపుణుల అభిప్రాయం.. వీటిని పాటించే ముందు వైద్యుని సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. 

Also Read:

RRR Movie: ట్రిపులార్‌ సక్సెస్‌పై తనదైన స్టైల్‌లో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఏమన్నరాంటే..

Karnataka: జాతరలో 73 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జానపద నృత్యాన్ని చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. వీడియో వైరల్