Boost Immunity: జలుబు, దగ్గు వెంటాడుతున్నాయా.. అయితే ఈ ఐదు రకాల జ్యూసులను ట్రై చేయండి.. ఇక మీరు సేఫ్..
శీతాకాలం వచ్చిందంటే సీజనల్ సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ఇందులో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు చలికాలంలో తరచుగా ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో..

Five Homemade Drinks: శీతాకాలం వచ్చిందంటే సీజనల్ సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ఇందులో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు చలికాలంలో తరచుగా ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం మీరు అనేక రకాల ఆరోగ్యకరమైన డిటాక్స్ పానీయాలను ఆహారంలో తీసుకోండి. మీరు ఈ జ్యూస్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని ఆనందించవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచే పసుపు
పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో పాలు లేదా టీలో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, కండరాల వాపులు నయం అవుతాయి. అదనంగా దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సెల్ డ్యామేజ్ చికిత్సలో సహాయపడతాయి. పసుపు టీ చేయడానికి అల్లంతో పాటు వేడినీటిలో చిటికెడు పసుపు వేసి కొంచెం తేనె కలపండి సరిపోతుంది.
పసుపు పాలు చేయడానికి..
1 కప్పు పాలను 1/2 కప్పు నీటితో వేడి చేయండి. అందులో చిటికెడు పసుపుతోపాటు కొద్దిగా చక్కెరను యాడ్ చేసుకోండి. కానీ, మీరు బరువు తగ్గాలని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని అనుకుంటే ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఆపిల్
మీరు రోగనిరోధక శక్తితో పాటు జీవక్రియను పెంచుకోవాలనుకుంటే ఆపిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ చేయడానికిక 1 ఆపిల్‌ను ముక్కలుగా కట్ చేయండి. 3 ఖర్జూరాలు, 3 బాదంపప్పులను పాలలో కలపండి. అప్పుడు 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన చియా గింజలను అందులో జోడించండి. ఇనుము, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఈ పానీయం గట్ హెల్త్, మెటబాలిజంను ప్రోత్సహించడానికి ఒక ఆరోగ్యకరమైన పానీయం.
బచ్చలికూర, అవోకాడో
ఇంట్లోనే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు , ఐరన్ సమృద్ధిగా ఉండే ఈ జ్యూస్‌ను తయారుచేసుకోవచ్చు. ఒక బ్లెండర్ తీసుకుని.. అందులో 1 కప్పు కడిగిన బచ్చలికూర ఆకులు.. సగం అవకాడో వేసి బాగా బ్లెండ్ చేసి అందులో సగం నిమ్మకాయ, రాక్ సాల్ట్ వేసి కలపండి. ఈ పానీయం మీకు పోషకాలను అందించడమే కాకుండా ఐరన్, యాంటీఆక్సిడెంట్ల ఉనికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
అల్లం, బీట్‌రూట్ టీ
ఈ టీ చేయడానికి, అల్లం, 1 1/2 కప్పుల నీరు, 1/2 కప్పు తురిమిన బీట్‌రూట్ తీసుకోండి. ఈ మిశ్రమాన్ని మరిగించి అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రాళ్ల ఉప్పు , ఎండుమిర్చి కలపండి. బీట్‌రూట్‌లోని మినరల్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు, నిమ్మరసం, అల్లంతో పాటు, సీజనల్ అలెర్జీలు, జలుబు, దగ్గు, జ్వరాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఉసిరి రసం
ఇంట్లో తయారుచేసిన ఉసిరి జ్యూస్ చేయడానికి కేవలం 4-5 ఉసిరికాయలను తీసుకోండి.. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోని గింజలను తొలగించండి. దీన్ని ఒక కప్పు నీటితో కలపండి. దానికి 1 చిటికెడు నల్ల మిరియాలు, 1 చిటికెడు రాక్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం జోడించండి. కాస్త తియ్యగా ఉండాలంటే తేనె కలుపుకోవచ్చు. ఒక సాధారణ మిశ్రమాన్ని తయారు చేసి ప్రతి ఉదయం తాగండి.
అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉసిరి రసం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది టాక్సిన్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆమ్లా జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి: Health Tips: గులాబీలా మెరిసిపోవడమే కాదు ఆరోగ్యం మీ సొంత చేసుకోండి.. ఎలానో తెలుసా..