Dengue Vaccine: ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) డెంగ్యూ వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్‌కు ఆమోదం లభించింది. మన దేశంలో డెంగ్యూ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో లేకపోవడంతో ఈ అనుమతి దేశానికే మైలురాయిగా మారింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో ఇటీవల డెంగ్యూ కేసులు భారీగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 5న విడుదల చేసిన పౌరసంఘాల నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల సంఖ్య 240 దాటింది.
ఆగస్టు చివరి వారం నాటికి 39 కొత్త కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 3 వరకు నమోదైన 244 కేసుల్లో 75 ఆగస్టులో నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో భారతదేశం డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. పనేసియా, సీరం వంటి సంస్థలు డెంగ్యూ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ప్రారంభించారు. ఇటీవల ఫేజ్ 1 , 2 ట్రయల్స్‌ను పూర్తి చేశారు. ICMR ఇప్పుడు ఫేజ్ 3 ట్రయల్స్ కోసం రెండు సంస్థలతో భాగస్వామ్యం పొందింది.
డెంగ్యూ కేసులను తగ్గించడానికి సహాయపడే వ్యాక్సిన్:
నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ హెచ్‌ఓడి అజయ్ అగర్వాల్ టీవీ9తో మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం చాలా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ సిద్ధమవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేటప్పటికీ తాము ఇప్పుడు వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్ తయారీ వార్త డెంగ్యూ బాధితులకు గుడ్ న్యూస్ వంటిదని.. డెంగ్యూ జ్వరంతో మరణాలను నివారించడంలో ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. వ్యాక్సిన్ మరణాల రేటుతో పాటు.. ఆసుపత్రిలో చేరే అవసరం కూడా తగ్గిస్తుంది.
గత కొన్నేళ్లుగా అమెరికాలో డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే భారత దేశంలో నాలుగు రకాల వైరస్‌లుగా రూపాంతరం చెందుతున్న డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణకు ఈ వ్యాక్సిన్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉందని.. ఈ వ్యాక్సిన్ భారతీయులకు ఎలా సహాయపడుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు.
టీకా వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలియాల్సి ఉందంటున్న వైద్య సిబ్బంది:
యాంటీబాడీలను పెంచే ప్రక్రియపై వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తమకు ఇంకా తెలియదని డాక్టర్ అగర్వాల్ చెప్పారు. ఒక వ్యక్తి శరీరంలో ఇప్పటికే డెంగ్యూ వైరస్ వ్యాపించి ఉంటే… అటువంటి వ్యక్తికీ డెంగ్యూ వ్యాక్సిన్‌ను ఇస్తే.. ఆ వ్యాక్సిన్ .. డెంగ్యూ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుందా లేదా అనేది త్వరలో తెలుస్తుందని చెప్పారు. అయితే డెంగ్యూ వ్యాక్సిన్‌లు అన్ని అంశాలను కవర్ చేస్తాయని.. వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు.
వ్యాక్సిన్ ఎప్పుడు.. ఎలా ఇవ్వాలో నిర్ణయించాల్సి ఉందని.. COVID-19 వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎలా టీకా ప్రభావం కొన్ని నెలల వరకు ఉంటుందో.. అదే విధంగా డెంగ్యూ వ్యాక్సిన్ పని చేస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఒకసారి టీకాలు వేసిన తర్వాత.. వైరస్ మళ్లీ పరివర్తన చెందుతోందా.. లేదా కొత్త డెంగ్యూ వ్యాక్సిన్ వ్యాధిని అరికట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందో లేదో చూడాలని వైద్య సిబ్బంది చెప్పారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..