Eye Dark Circles: మీ కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? వాటిని పోగొట్టడం ఎలా..?
Eye Dark Circles: మనిషికి శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. కళ్ల విషయాలలో..
Eye Dark Circles: మనిషికి శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. కళ్ల విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా చాలా మందికి కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల క్రిములను వాడుతుంటారు. నిద్రలేమి, పోషకాహార లోపం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం, అలర్జీ.. ఇలా చాలా అంశాలు నల్లటి వలయాలకు కారణమవుతాయి. వీటిని పోగొట్టేందుకు కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. కంటి వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్లటి వలయాలకు చిట్కాలు..
► కీర దోసను ముక్కలుగా కట్ చేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత వాటిని పావుగంట పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. నల్లటి వలయాలు నెమ్మదిగా దూరమవుతాయి.
► సాధారణంగా అలొవెరా అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన మాయిశ్చర్‌ని అందిస్తుంది. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చాలా మంది వైద్య నిపుణులు చెబుతుంటారు. అలొవెరాను కొద్దిగా కట్ చేసి జెల్‌ను కళ్ల కింద భాగంలో రాయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
► బంగాళదుంపను గుజ్జుగా చేసి, ఆ గుజ్జును కళ్లపై పావుగంట పాటు ఉంచితే చాలు మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు దూరమవుతాయి.
► ఒక టీస్పూన్ టొమాటో జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
► టొమాటోను కట్ చేసి ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు అలా వదిలేస్తే ఎంతో ఉపయోగం.
► కొద్దిగా దూది తీసుకుని రోజ్ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా పావుగంట పాటు చేయడం వల్ల కళ్లు రీఫ్రెష్ అవుతాయి. దీంతో నల్లటి వలయాలు పోతాయి. ఇంట్లోనే ఉండి ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఎంతో ఫలితం ఉంటుందంటున్నారు కంటి వైద్య నిపుణులు.
ఇవి కూడా చదవండి: