AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Side Effects: తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగుతున్నారా.. విషంగా మారొచ్చు జాగ్రత్త..

తేనెను వేడినీటిలో వేస్తే విషంగా మారుతుందని, అందువల్ల దానిని వేడినీటిలో, మరిగేనీటిలో వేయకూడదని చెబుతున్నారు.

Honey Side Effects: తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగుతున్నారా.. విషంగా మారొచ్చు జాగ్రత్త..
Honey Hot Water
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2022 | 11:42 AM

Share

తేనెలో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయుర్వేద కాలం నుంచి తేనెను ఉపయోగిస్తున్నారు. అయితే తేనెను కొన్ని విధాలుగా తీసుకుంటే విషంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఉదయం నిద్ర లేవగానే తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం అలవాటుగా ఉంటుంది. తేనె, నిమ్మరసం వల్ల బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి మినరల్స్‌‌తో పాటు, విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. అయితే.. తేనెను కొన్ని విధాలుగా తీసుకుంటే విషంగా మారే ప్రమాదం ఉంది. కేవలం తేన మాత్రమే తీసుకుంటే ఒక విధంగా వేడి నీటితో తీసుకుంటే మరో విధంగా, చల్లని నీటితో తీసుకుంటే ఇంకో విధంగా ప్రభావం చూపుతుంది. అయితే గోరువెచ్చని నీటితో తేనె కలుపుకుని తాగే వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

తేనెను వేడినీటిలో వేస్తే విషంగా మారుతుందని, అందువల్ల దానిని వేడినీటిలో, మరిగేనీటిలో వేయకూడదని చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయడం లేదా ఉడికించడం వంటివి చేయకూడదు. 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల తేనెలో రసాయన మార్పులు జరుగుతాయి. వేడి తేనె తాగడం వల్ల విషపూరిత అణువులు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి తేనెను వేడి చేయకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడే తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.