AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Effect: మీరు తరచుగా చేతులును శుభ్రం చేసుకుంటున్నారా? జాగ్రత్త లైఫ్ డేంజర్‌లో పడొచ్చు..!

Covid 19 Effect: COVID-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని హడలెత్తించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా జడుసుకునే పరిస్థితి నెలకొంది.

Covid 19 Effect: మీరు తరచుగా చేతులును శుభ్రం చేసుకుంటున్నారా? జాగ్రత్త లైఫ్ డేంజర్‌లో పడొచ్చు..!
Ocd
Shiva Prajapati
|

Updated on: Jul 19, 2022 | 3:31 PM

Share

Covid 19 Effect: COVID-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని హడలెత్తించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా జడుసుకునే పరిస్థితి నెలకొంది. ఎంతటి సన్నిహితులైనా.. కనీసం కరచాలం చేసుకోవడానికి హడలిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మహమ్మారి కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే.. ఈ మాయదారి కరోనా పేరు చెబితేనే జనాలు ఇప్పటికీ జడుసుకుంటున్నారు. అయితే, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి నివారణ చర్యలే ఉత్తమం అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ రాసుకోవడం, సబ్బు, నీటితో చేతులను తరచుగా కడుక్కోవడం చేయాలి. కరోనా భయంతో, వ్యాధి తమకు సోకుతుందనే ఆందోళనతో చాలా మంది అవసరమైన దానికంటే ఎక్కువసార్లు, తరచుగా చేతులు కడుక్కుంటున్నారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి అబ్సెసివ్-కంపల్సిన్ డిజార్డర్(OCD)కి కారణం అవుతుందని చెబుతున్నారు.

ఈ OCDలో మెదడులోని వివిధ భాగాలలో జీవరసాయన ప్రతిబంధకాలు ప్రేరేపించబడతాయి. న్యూరోట్రాన్స్మిటర్లు సాధారణ పరిధి నుంచి బయటికి వస్తాయి. అలా OCD లోకి మానిఫెస్ట్ అవుతాయి.

కాగా, OCDలో రెండు రకాలు ఉన్నాయని ఢిల్లీకి చెందిన సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ వివరించారు. వాటిలో ఒకటి అబ్సెషన్స్, మరొకటి కంపల్షన్స్. ‘‘అబ్సెషన్‌లో అతిగా ఆలోచించడం జరుగుతుంది. అంటే.. నిరంతర, పునరావృత, అనుచిత ఆలోచనలు, చిత్రాలు లేదా ప్రేరణలు వ్యక్తి తన మెదడులోకి వస్తున్నాయని గ్రహిస్తారు. అవి వచ్చిన ప్రతిసారీ, బాధిత వ్యక్తి వాటిని అహేతుకంగా గుర్తిస్తాడు. కాగా, అతను ఈ ఆలోచనలను నిరోధించడానికి ప్రయత్నించడం వలన.. ఇది మరింత ఆందోళనను కలిగిస్తుంది. రోగి ఎంత ప్రయత్నించినా.. వాటిని వదిలించుకోలేడు’’ అని డాక్టర్ చుగ్ వివరించారు.

సాధారణంగా వ్యక్తిలో ఆందోళన పెరిగినప్పుడు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి శారీరక శ్రమను ఆశ్రయిస్తారని డాక్టర్ తెలిపారు. అయితే, ఇలాంటి శారీరక శ్రమను ‘బలవంతమైన శ్రమ’ అని పిలుస్తారు. ‘ఈ ఆలోచనలు, బలవంతాలు ఒక వ్యక్తి నియంత్రణకు మించినవి. వీటిని అతను(బాధిత వ్యక్తి) ఆనందించలేడు. ఇది వ్యక్తి వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన జీవితంలో గణనీయమైన బలహీనతను కలిగిస్తుంది. OCD దీర్ఘకాలిక ప్రభావాలు నిరాశ, స్థిరమైన ఆందోళనలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడటం జరుగుతుంది.’’ అని డాక్టర్ చుగ్ చెప్పారు.

OCDకి సంబంధించిన కొన్ని లక్షణాలు, ఉప రకాలు బాధిత వ్యక్తుల్లో కనిపిస్తాయి. ఇవి వ్యాధి ప్రారంభ లక్షణాలు. వీటిలో రెండు అత్యంత సాధారణమైనవి.. ప్రతీది తరచుగా చెక్ చేయడం, తరచుగా క్లీన్ చేసుకోవడం. మొదటి లక్షణం కనిపించే వ్యక్తులు గేట్ లాక్ చేయబడిందా లైట్ స్విచ్ ఆఫ్ చేశారా? లేదా? అని వందలసార్లు చెక్ చేస్తుంటారు. రెండవ లక్షణంలో బాధితులు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడం, కడుక్కోవడం వంటివి చేస్తుంటారు. చేతులు, స్థలం మురికిగా ఉన్నాయని భావిస్తారు. ఆ కారణంగా తాము ఉండే ప్రాంతాన్ని నిరంతరం శుభ్రం చేస్తూనే ఉంటారు.

కాగా, OCD ధీర్ఘకాలిక ప్రభావాలలో డిప్రెషన్, స్థిరమైన ఆందోళన పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోనే వేరే లక్షణాలు కలవారు కూడా ఉన్నారు. సమరూపత పాటించేవారు. వీరు.. ఒక నిర్దిష్ట మార్గంలో పనులు జరగాలని భావిస్తారు. ప్రతీది పద్ధతిగా ఉండాలని భావిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతారు. మరోరకం వ్యక్తులు.. భౌతికంగా ఏమీ చేయకపోయినప్పటికీ.. వారిలో పునరావృత ఆలోచనలు మాత్రం నిరంతరం వస్తూనే ఉంటాయి. అబ్సెసివ్ రూమినేషన్ కల వ్యక్తుల్లో లైంగిక కోరికలు గానీ, మతపరమైన భావనలు గానీ అధికంగా వస్తాయని డాక్టర్ చుగ్ తెలిపారు.

OCD కి కారణం సాధారణ మానిసక సమస్యలేనని డాక్టర్ చుగ్ వివరించారు. ‘‘వ్యక్తులు అనారోగ్యాన్ని అభివృద్ధి చేసే జన్యువులను వారసత్వంగా పొందుతారు. ఈ జన్యుపరమైన అంశాలే.. వారు ఎంత త్వరగా లేదా ఆలస్యంగా బయటపడతారు? లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయి? అనేది నిర్ణయిస్తుంది. జన్యుపరమైన అంశాలే OCD కి కారణం అవుతాయి. వివిధ పరిశోధనల ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే.. నిర్ధిష్టమైన జన్యుపరమైన ఆధారం లేకుండా ఆ వ్యాధి రాదు.’’ అని డాక్టర్ చుగ్ వివరించారు.

ఈ OCDకి నివారణ ఉందా? OCDని నివారించడం సాధ్యం కాదని డాక్టర్ చుగ్ తెలిపారు. ‘‘ఒక వ్యక్తికి ఈ పరిస్థితి వస్తే.. మరో స్టేజ్‌కి మారుతుంది తప్ప పూర్తిగా నయం కాదు. అయితే, ముఖ్యమైన విషయం ఏంటంటే.. వ్యాధిని ముందస్తుగా నిర్ధారించడం. ఎంత త్వరగా వ్యాధిని గర్తించి చికిత్స తీసుకుంటే.. ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అలాగే, సమస్య తీవ్రత కూడా తగ్గుతుంది. ఇది వ్యక్తి జీవితంపై ప్రభావాన్ని తగ్గిస్తుంది’’ అని డాక్టర్ చుగ్ వివరించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..