Women Health: 40 ఏళ్ల తర్వాత మహిళలు కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
40 ఏళ్లకు లేదా 45 తర్వాత చాలా మంది స్త్రీలకు కీళ్ల నొప్పులు, శారీక సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య నుండి తప్పించుకోవాలనుకుంటే.. మహిళలు తాము తినే ఆహారంలో క్యాల్షియం అధికంగా ఉండే కొన్ని ఆహార పదార్ధాలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Women Health: ఆధునిక యుగంలో జీవన విధానం, తినే ఆహారం, వాతావరణం అన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వయసు దాటిన తర్వాత వచ్చే వ్యాధులు.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. దీంతో రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు నడుస్తున్నప్పుడు కీళ్ల నొప్పుల వంటి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే… ఈ సమస్య ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్‌గా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనికి కారణం శరీరంలో పోషకాలు.. ముఖ్యంగా కాల్షియం లేకపోవడం అని తెలుస్తోంది. స్త్రీలు గర్భం కారణంగానే కాదు.. 45 తర్వాత శరీరంలో తగినంత కాల్షియం ఉండదు. కనుక మహిళలు..లో రెగ్యులర్ తినే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. అయితే చాలా మంది మహిళలు తాము తినే ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.. దీని కారణంగా 40 ఏళ్లకు లేదా 45 తర్వాత కీళ్ల నొప్పులు, శారీక సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య నుండి తప్పించుకోవాలనుకుంటే.. మహిళలు తాము తినే ఆహారంలో క్యాల్షియం అధికంగా ఉండే కొన్ని ఆహార పదార్ధాలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
అంజీర్ మీ ఆహారంలో అత్తి పండ్ల (అంజీర్) ను క్రమం తప్పకుండా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంజీర్ శరీరంలోని కాల్షియ లోపాన్ని పది శాతం తీరుస్తుంది. అందుకే ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో రెండు అంజీర పండ్లను తినమని సూచిస్తున్నారు. అంజీర్ ను రాత్రి నానబెట్టి.. ఉదయం క్రమం తప్పకుండా తినాలని చెబుతున్నారు.
ఆకు కూరలు ఆకు కూరలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినే ఆహారంలో చేర్చుకోవాలి. కాల్షియంతో పాటు, ఇవి మీ శరీరానికి విటమిన్ సి, ఐరన్, పొటాషియం మొదలైన అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. పాలకూర, బచ్చలికూర వంటి ఆకు కూరల్లో చాలా కాల్షియం లభిస్తుంది.




చియా సీడ్స్: శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించడానికి మీరు చియా విత్తనాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిని నీరు, పాలు లేదా పెరుగులో చేర్చుకుని తినవచ్చు. ఇవి తినడం వలన శరీరానికి కాల్షియం మాత్రమే కాదు అనేక పోషకాలను కూడా ఇస్తుంది.
పాలు కాల్షియం లోపాన్ని అధిగమించడానికి పాలు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతున్నాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి దాదాపు 300 మి.గ్రా కాల్షియం అందుతుంది. పాలతో పాటు పెరుగు, జున్ను, వెన్న, పన్నీరు మొదలైన పాలతో చేసిన ఇతర వస్తువులనుతినే ఆహారంలో చేర్చుకోవాలి.
సోయాబీన్స్ సోయాబీన్ లో ప్రోటీన్‌తో పాటు కాల్షియం కూడ అధికంగా లభిస్తుంది. సోయా బీన్స్ ను తినే ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. సోయా బీన్స్ ను కూరగా చేసుకుని తినవచ్చు. సోయా బీన్స్ పాలు కూడా ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




