- Telugu News Photo Gallery Healthy Liver Drinks Detox Drinks for Healthy Liver Drink these 4 detox drinks to keep the liver healthy
Healthy Liver Drinks: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 4 డిటాక్స్ డ్రింక్స్ తాగండి..
Healthy Liver Drinks: కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది ఎంజైమ్‌ను సక్రియం చేస్తుంది.
Updated on: Jul 19, 2022 | 9:11 AM

Healthy Liver Drinks: కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది ఎంజైమ్‌ను సక్రియం చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాలేయం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అనేక రకాల హెల్తీ డ్రింక్స్ ను తీసుకోవచ్చు. ఆ హెల్తీ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

ఉసిరి రసం: ఉసిరి రసం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

పుదీనా టీ: పుదీనాలో మెంథాల్ ఉంటుంది. పుదీనా టీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక కప్పు పుదీనా టీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అవి ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. గ్రీన్-టీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రీన్-టీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

టర్మరిక్ టీ(పుసుపు టీ): టర్మరిక్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపు టీ చేయడానికి.. పాన్లో ఒక కప్పు నీటిని వేడి చేయాలి. ఒక టీస్పూన్ పసుపు కలపాలి. అది మరిగాక.. కాస్త నిమ్మరసం, చిటికెడు ఎండుమిర్చి కలపాలి. ఆ తర్వాత తాగాలి.





























