Health Tips: వినోదం మరణానికి కారణమవుతోందా.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా..
మనిషి సంఘ జీవి. నిత్యం ఎన్నో రకాల పనులతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటాడు. అలాంటప్పడు ఎంటర్టైన్మెంట్ కోరుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు. అయితే.. కొన్ని సార్లు వినోదం ప్రాణాలు తీస్తోంది. మనసును...
మనిషి సంఘ జీవి. నిత్యం ఎన్నో రకాల పనులతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటాడు. అలాంటప్పడు ఎంటర్టైన్మెంట్ కోరుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు. అయితే.. కొన్ని సార్లు వినోదం ప్రాణాలు తీస్తోంది. మనసును ప్రశాంతంగా ఉంచాల్సిన వినోదం ఇప్పుడు ప్రాణాలు తీస్తోండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణంగా సినిమా చూస్తున్నప్పుడు అనుభూతి చెందడం వంటి విపరీతమైన భావోద్వేగాల నుంచి శరీరం తీవ్రమైన శారీరక ప్రభావాలకు గురవుతోంది. వైద్య శాస్త్రం ప్రకారం.. సినిమా చూస్తున్నప్పుడు జంప్ స్కేర్ లేదా అతి ఉత్సాహం కారణంగా గుండెపోటు రావడం అసాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల అవతార్ 2 సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. సినిమా చూస్తుండగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆ సినిమా వల్ల గుండెపోటు వచ్చిందా? అనేది సమాధానం లేని ప్రశ్నలుగా మారుతున్నాయి. భయానక, ఒత్తిడిని కలిగించే చలన చిత్రాల సమయంలో కలిగే అసౌకర్యం కారణంగా శరీరం గతి తప్పుతోందంటున్నారు నిపుణులు.
సినిమా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు అనుభూతి చెందే తీవ్రమైన భావోద్వేగాలు.. శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే గుండె సమస్యలకు గురయ్యే వ్యక్తుల్లో గుండెపోటుకు కారణమవుతుంది. ఈ పరిస్థితిని స్ట్రెస్ కార్డియోమయోపతి అంటారు. దీనిని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని అంటారు. శారీరక లేదా భావోద్వేగ ఒత్తిడికి గురైనప్పుడు.. ప్రతిస్పందనలో భాగంగా మెదడు సంకేతాలను పంపిస్తుంది. అడ్రినలిన్ హార్మోన్ అదనపు మొత్తాన్ని పంప్ చేస్తాయి. అడ్రినలిన్ స్థాయిలు పెరగడంతో, హృదయ స్పందన రేటు, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది గుండె కొట్టుకునే పనితీరును ప్రభావితం చేస్తుంది.
దీని వలన రక్త నాళాల సంకోచం ఏర్పడతాయి. ఒత్తిడి కారణంగా గుండె కండరాల పనిచేయకపోవడం లేదా వైఫల్యం ఏర్పడినప్పుడు ఒత్తిడి-ప్రేరిత కార్డియోమయోపతి వస్తుంది. ఇది తాత్కాలికం. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడు గుండెపోటుకు కారణమవుతున్నాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..